AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: హిరోషిమాలో అణు దాడిలో మరణించిన వారికి ప్రధాని మోదీ నివాళులు.. అనంతరం..

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు జపాన్ పర్యటనలో రెండవ రోజు G7 సమావేశంలో పాల్గొంటారు. ఆ తర్వాత బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌ను కలుస్తారు. ముందుగా హిరోషిమాలో అణు దాడిలో మరణించిన వారికి నివాళులు అర్పించారు.

PM Modi: హిరోషిమాలో అణు దాడిలో మరణించిన వారికి ప్రధాని మోదీ నివాళులు.. అనంతరం..
PM pay floral tribute at Hiroshima
Sanjay Kasula
|

Updated on: May 21, 2023 | 7:54 AM

Share

ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ పర్యటన ఇవాళ రెండో రోజుకు చేరుకుంది. 78 ఏళ్ల క్రితం హిరోషిమాలో అణుబాంబు వేసిన ప్రదేశానికి ప్రధాని మోదీ చేరుకున్నారు. ముందుగా హిరోషిమా పీస్ మెమోరియల్ వద్ద అటామ్ బాంబ్ దాడిలో మరణించిన వ్యక్తులకు నివాళులర్పించిన ప్రధాని మోదీ. ఆ తర్వాత పీస్ మెమోరియల్ మ్యూజియాన్ని కూడా సందర్శిస్తారు. G7 సమావేశంలో పాల్గొనడం నుంచి ప్రధాని మోదీ వివిధ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. సమావేశాలకు వచ్చిన దేశ  అధినేతలో సమావేశం అవుతున్నారు.

అదే సమయంలో, ఇవాళ్టి కార్యక్రమంలో బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునక్‌ను కూడా ప్రధాని మోదీ కలుస్తారు. ఆ తర్వాత PM భారతదేశ పసిఫిక్ దీవుల సహకార సదస్సులో పాల్గొనడానికి పాపువా న్యూ గినియాకు బయలుదేరుతారు.

భారతదేశంలో క్వాడ్ మీటింగ్ 2024..

శనివారం (మే 20) ప్రధాని మోదీ జి-7 మరియు క్వాడ్ నాయకులతో జెలెన్స్కీ వరకు సమావేశమయ్యారు. క్వాడ్ సమ్మిట్‌లో ప్రధాని మాట్లాడుతూ, ‘ఇండో-పసిఫిక్‌లో శాంతి, స్థిరత్వం, శ్రేయస్సును నిర్ధారించడానికి క్వాడ్ గ్రూప్ ఒక ముఖ్యమైన వేదిక అని అన్నారు. ఇది ప్రపంచ వాణిజ్యం, ఆవిష్కరణ, అభివృద్ధి ఇంజిన్. ఈ సమావేశంలో, 2024లో భారతదేశంలో క్వాడ్ సమావేశం జరుగుతుందని ప్రధాని మోదీ ప్రకటించారు.

ఉక్రెయిన్‌లో పర్యటించండి.. ప్రధాని మోదీకి జెలెన్స్కీ ఆహ్వానం

అదే సమయంలో జపాన్‌లోని హిరోషిమాలో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీని ప్రధాని మోదీ కలిశారు. ఈ సమయంలో, అతను యుద్ధం గురించి.. అక్కడ నెలకొన్న పరిస్థితుల గురిచి ప్రధాని మోదీకి వివరించారు. ఇది మాకు మానవతా సమస్య అని, దాని పరిష్కారం కోసం భారతదేశం ఖచ్చితంగా ఉక్రెయిన్ కోసం ఏదైనా చేస్తుంది. అదే సమయంలో ఉక్రెయిన్‌లో పర్యటించాల్సిందిగా ప్రధాని మోదీని జెలెన్స్కీ ఆహ్వానించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం