రేపట్నుంచి యూకేలో ఫైజర్ టీకా.. ఫ్రంట్ లైన్ వర్కర్లకి, వృద్ధులకి తొలి ప్రాధాన్యం… బ్రిటన్ రాణికి త్వరలో టీకా…

బ్రిటన్‏లో భారీ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి రంగం సిద్ధమైంది. మొత్తం 50 జాతీయ ఆరోగ్య సేవా ఆసుపత్రులలో కొవిడ్ అంతానికి ఫైజర్ వ్యాక్సిన్‏ను ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

రేపట్నుంచి యూకేలో ఫైజర్ టీకా.. ఫ్రంట్ లైన్ వర్కర్లకి, వృద్ధులకి తొలి ప్రాధాన్యం... బ్రిటన్ రాణికి త్వరలో టీకా...
Follow us

|

Updated on: Dec 07, 2020 | 7:30 AM

బ్రిటన్‏లో భారీ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి రంగం సిద్ధమైంది. మొత్తం 50 జాతీయ ఆరోగ్య సేవా ఆసుపత్రులలో కొవిడ్ అంతానికి ఫైజర్ వ్యాక్సిన్‏ను ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కానున్నట్టు బ్రిటన్ ఆరోగ్య శాఖ మంత్రి మట్ హన్‏కాక్ చెప్పారు. ముందుగా ఫ్రంట్ లైన్ వర్కర్లకు, వృద్ధులకు, వారి సంరక్షకులకు ఈ వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టుగా మంత్రి తెలిపారు. ప్రజలు ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సహకరించాలని, నిబంధనలన్నీ తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. యూకే గతవారంలోనే అమెరికాకు చెందిన ఫైజర్ టీకా అత్యవసర వినియోగానికి అనుమతుల్ని మంజూరు చేసింది. 6.7 కోట్ల జనాభా ఉన్న బ్రిటన్ తొలి విడతగా 2 కోట్ల మందికి టీకా డోసుల్ని ఇవ్వనుంది. ఇందుకు 4 కోట్ల టీకా డోసులకు ఆర్డర్ చేసింది. బెల్జియం నుంచి 8 లక్షల డోసులు జాతీయ ఆరోగ్య కేంద్రాలకి చేరుకున్నాయి.

రాణి దంపతులకు వ్యాక్సినేషన్..

బ్రిటన్ రాణి ఎలిబెజెత్ (94), ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్ (99)‏లకు కూడా త్వరలో ఈ ఫైజర్ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. వారి వయసును దృష్టిలో ఉంచుకొని తొలి ప్రాధాన్యంగా టీకా ఇస్తారని ది మెయిల్ పత్రిక వెల్లడించింది. ఈ టీకా వల్ల ఎలాంటి దుష్ర్పభావాలు ఉండవని తెలిపెందుకు రాణి దంపతులతోపాటు మరి కొందరు ప్రముఖులు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకునున్నారు. అటు బకింగ్ హామ్ ప్యాలె‏స్ ఈ టీకా విషయంలో ఇంకా స్పందించాల్సి ఉంది.