ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతంగా ఉన్న మౌంట్ ఎవరెస్ట్ ఎత్తును రేపు మళ్లీ లెక్కించి చెప్పనున్న నేపాల్
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతంగా ఉన్న మౌంట్ ఎవరెస్ట్ ఎత్తును మళ్లీ కొలవాలని నేపాల్ సర్కారు నిర్ణయించింది. ఈ పర్వతం ఎత్తు లెక్కలపై...
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతంగా ఉన్న మౌంట్ ఎవరెస్ట్ ఎత్తును మళ్లీ కొలవాలని నేపాల్ సర్కారు నిర్ణయించింది. ఈ పర్వతం ఎత్తు లెక్కలపై ఇటీవల కాలంలో సందేహాల్ని వ్యక్తం చేసిన నేపాల్ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా గత ఏడాది నుంచి పర్వతాన్ని కొలుస్తూ డేటాను సేకరించింది. తాము సేకరించిన తాజా డేటా ప్రకారం మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు ఎంత ఉందనేది మంగళవారం వెల్లడిస్తామని సర్వే డిపార్ట్‌మెంట్ తాజాగా వెల్లడించింది. అంతేకాకుండా ఈ డేటా కోసం పనిచేసిన వారిని ఇదే కార్యక్రమంలో సత్కరించనున్నట్టు సర్వే డిపార్ట్‌మెంట్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సుశిల్ నార్సింగ్ రాజ్‌భండారి చెప్పారు. కాగా.. 1954లో సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించిన డేటా ప్రకారం మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు 8,848 మీటర్లు. అయితే 2015లో నేపాల్‌లో భూకంపం వచ్చిన తరువాత నేపాల్ ప్రభుత్వం మౌంట్ ఎవరెస్ట్ ఎత్తుపై సందేహాన్ని వ్యక్తం చేసింది.