జూమ్ బాబు, చాలు..చాలు. చంద్రబాబు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై ఏపీ మంత్రుల ముప్పేటదాడి
ఆంధ్రప్రదేశ్ మంత్రులు టీడీపీ అధినేత చంద్రబాబుపైనా, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పైనా ముప్పేటదాడికి దిగారు. గవర్నర్...
ఆంధ్రప్రదేశ్ మంత్రులు టీడీపీ అధినేత చంద్రబాబుపైనా, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పైనా ముప్పేటదాడికి దిగారు. గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌కు సలహాలు ఇచ్చే స్థాయి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు లేదని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు ఏం చెబితే నిమ్మగడ్డ అదే చేస్తున్నారన్నారు. కరోనా దృష్ట్యా ఎన్నికలు సాధ్యం కాదని అసెంబ్లీలో తీర్మానం చేశామన్నారు. ఇక, ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు విమర్శించారు. అబద్ధాలు చెప్పనిదే ఆయనకు పూట గడవడం లేదని మండిపడ్డారు. వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ చంద్రబాబు ప్రధానికి ఎందుకు లేఖ రాయలేదని కన్నబాబు ప్రశ్నించారు. మరోవైపు, ఎన్నికలకు భయపడే నాయకుడు సీఎం జగన్ కాదన్నారు మంత్రి అవంతి శ్రీనివాస్. కరోనా వల్ల స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదన్నారు. హైదరాబాద్‌లో కూర్చుని జూమ్ రాజకీయాలు చేసే చంద్రబాబు – జగన్‌ను విమర్శించడం విడ్డూరమన్నారు అవంతి.