ఏలూరులో జనం మూర్చపోతోన్న ఘటనలపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరా, అవసరమైన సాయం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరిజిల్లా కేంద్రం ఏలూరులో ఉన్నఫలంగా ఫిట్స్ వచ్చి జనం మూర్చపోతోన్న ఘటనపై కేంద్ర మంత్రి...
ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరిజిల్లా కేంద్రం ఏలూరులో ఉన్నఫలంగా ఫిట్స్ వచ్చి జనం మూర్చపోతోన్న ఘటనపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరాతీశారు. అవసరమైన సాయం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీతో మాట్లాడిన కేంద్ర మంత్రి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇలా ఉండగా, ఏలూరులో అస్వస్థతకు గురౌతోన్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. వారి ఆరోగ్యం ఇంకా పూర్తిగా మెరుగుపడలేదు. ఈ క్రమంలో ఒకరు మృతి చెందడంతో ఆస్పత్రిలో ఉన్న రోగులు, స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఏలూరు విద్యానగర్‌కు చెందిన శ్రీధర్ (45) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే. అతను ఉదయం మూర్చ లక్షణాలతో ఆస్పత్రిలో చేరాడు. సరైన వైద్యం అందకనే మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఇతర అనారోగ్య సమస్యల కారణంగానే మృతి చెందాడని వైద్యులు చెబుతున్నారు.