ఐఎమ్ఎఫ్ నుంచి రుణాలు.. ప్రజల్లో తీవ్ర ఆగ్రహం.. గరిష్ఠస్థాయికి చేరిన ధరలు
అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి రుణాలు తీసుకోవడంపై పౌర సమాజం నుంచి పాకిస్తాన్ ప్రభుత్వం(Pakisthan) తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఆర్థిక దుర్వినియోగం, దేశాన్ని సమర్థంగా ముందుకు...
అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి రుణాలు తీసుకోవడంపై పౌర సమాజం నుంచి పాకిస్తాన్ ప్రభుత్వం(Pakisthan) తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఆర్థిక దుర్వినియోగం, దేశాన్ని సమర్థంగా ముందుకు నడిపించేందుకు విదేశీ నిధులపై అధికంగా ఆధారపడటం వల్ల ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారని ఓ నివేదిక తెలిపింది. IMF రుణాల ఆరో విడతకు తాము సంతోషిస్తున్నట్లు పాక్ ఆర్థిక మంత్రి షౌకత్ తారిన్(Showkath Tarin) ట్వీట్ చేశారు. దీనిపై పౌరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐఎమ్ఎఫ్ నుంచి రుణాలు అందినందుకు సంతోషం వ్యక్తం చేయడం ఆశ్చర్యకరంగా ఉందని అనుకుంటున్నట్లు నివేదిక పేర్కొంది. రోజువారీ అవసరాలకు రుణాలు అవసరమయ్యే ఏకైక అణు దేశం, సహాయం కోసం యాచించడం దశాబ్దాలుగా కొనసాగుతోంది” అని తెలిపింది. షరతులకు లోబడి IMF పాకిస్తాన్‌కు నిధులు విడుదల చేసిన తర్వాత ఎదురుదెబ్బ తగిలింది. ఫలితంగా దేశంలో ఇంధన ధరలు, పవర్ టారిఫ్‌లు గరిష్ఠస్థాయికి చేరుకున్నాయి.
పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఈనెల 23న రష్యా టూర్‌కి వెళ్లారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం రష్యా కు వెళ్లిన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాజధాని మాస్కోలో అడుగు పెట్టారు. అక్కడ ఆయనకు రష్యా విదేశాంగ అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఓవైపు రష్యా ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తుండంతో.. రష్యా తీరుని ఖండిస్తూ.. ఆదేశంపై ఆర్ధికంగా ఆంక్షలు విధిస్తూ చర్యలు తీసుకుంటున్న వేళ.. ఇప్పుడు పాక్ ప్రధాని.. రష్యాతో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు తహతహలాడుతున్నారు. రష్యాలో పర్యటించడం రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చర్చలు జరపడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాక్ రష్యా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ఇంధన రంగంలో సహకారాన్ని పెంచే విషయంపై పుతిన్, ఇమ్రాన్ చర్చించుకున్నట్లుగా సమాచారం. అయితే ఈ సమయంలో ఇమ్రాన్ ఖాన్ మాస్కో వెళ్లడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
Also Read
News Watch: యుక్రెయిన్ విలవిల… మన విద్యార్థుల పరిస్థితి తెలుసా ?? వీడియో
ప్రాణం తీసిన అతివేగం.. గమ్యం చేరకుండానే మృత్యు ఒడికి.. అదే కారణమా