ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ కళా మ్యూజియంలో దొంగలు పడ్డారు.. ఏం ఎత్తుకెళ్లారంటే..?
మొత్తం తొమ్మిది విలువైన వస్తువులను దొంగిలించారని సమాచారం. పోలీసులు, మ్యూజియం అధికారులు ఈ సంఘటనను ధృవీకరించాయి. దొంగిలించిన ఆభరణాల విలువను ప్రస్తుతం అంచనా వేస్తున్నారు. మ్యూజియం తెరిచిన వెంటనే ముగ్గురు ముసుగు దొంగలు ఈ నేరానికి పాల్పడ్డారని స్థానిక మీడియా పేర్కొంది. దొంగతనం తర్వాత, వారు బయట వేచి ఉన్న స్కూటర్‌పై పారిపోయారు.

ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ కళా మ్యూజియంలో దొంగలు పడ్డారు. మ్యూజియంలోకి చొరబడ్డ దుండగులు, సినీ పక్కీలో దోపిడీకి పాల్పడ్డారు. శనివారం (అక్టోబర్ 18) ఉదయం మ్యూజియం ప్రారంభమైన సమయంలోనే దొంగతనం జరిగిందని ఫ్రెంచ్ సాంస్కృతిక మంత్రి రచిదా దాటి తెలిపారు. “లౌవ్రే మ్యూజియంలో దొంగతనం జరిగింది. ఎవరికీ గాయాలు కాలేదు. మ్యూజియం సిబ్బంది, పోలీసులతో సంఘటన స్థలంలో ఉన్నాను” అని మంత్రి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
ఫ్రెంచ్ వార్తా సంస్థ AFP ప్రకారం, దొంగలు మ్యూజియంలో దొంగలు పడి నగలను దోచుకున్నారు. అయితే, లౌవ్రే మ్యూజియం అధికారులు మాత్రం ఈ సంఘటనపై ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ప్రత్యేక కారణాల వల్ల మ్యూజియం ఈ రోజు మూసివేయడం జరుగుతుందని మ్యూజియం వెబ్‌సైట్ పేర్కొన్నారు. లౌవ్రే మ్యూజియం ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ కళా మ్యూజియంలలో ఒకటి మోనాలిసా వంటి ప్రసిద్ధ కళాఖండాలను ఇక్కడే ఉన్నాయి.
దొంగతనం ఒక సినిమా తరహాలో జరిగింది. దొంగలు ఒక నిర్మాణ స్థలం నుండి మ్యూజియంలోకి చొరబడ్డారు. తెల్లవారుజామున ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది నేరస్థులు మ్యూజియంలోకి ప్రవేశించారని పారిస్ పోలీసులు తెలిపారు. దొంగలు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సీన్ నదికి ఎదురుగా ఉన్న విభాగం నుండి ప్రవేశించారు. వారు అపోలో గ్యాలరీలోని ఒక గదికి చేరుకోవడానికి నిర్మాణ సామగ్రిని రవాణా చేయడానికి ఏర్పాటు చేసిన లిఫ్ట్‌ను ఉపయోగించి కిటికీలను పగలగొట్టారు. లోపలికి వెళ్ళిన తర్వాత , దొంగలు అక్కడ కనిపించిన అత్యంత ప్రాచీన నగలను దోచుకెళ్లారు.

మొత్తం తొమ్మిది విలువైన వస్తువులను దొంగిలించారని సమాచారం. పోలీసులు, మ్యూజియం అధికారులు ఈ సంఘటనను ధృవీకరించాయి. దొంగిలించిన ఆభరణాల విలువను ప్రస్తుతం అంచనా వేస్తున్నారు. మ్యూజియం తెరిచిన వెంటనే ముగ్గురు ముసుగు దొంగలు ఈ నేరానికి పాల్పడ్డారని స్థానిక మీడియా పేర్కొంది. దొంగతనం తర్వాత, వారు బయట వేచి ఉన్న స్కూటర్‌పై పారిపోయారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
