Social Media: సోషల్ మీడియా పిల్లలపై సానుకూల ప్రభావం చూపుతోంది.. సర్వేలో షాకింగ్ విషయాలు

కరోనా(Corona) కారణంగా జీవనశైలిలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి జీవితాల్లో మార్పు అనివార్యమైంది. ముఖ్యంగా విద్యారంగంపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. ఆన్ లైన్ లో(Online Teaching) విద్యాబోధనతో...

Social Media: సోషల్ మీడియా పిల్లలపై సానుకూల ప్రభావం చూపుతోంది.. సర్వేలో షాకింగ్ విషయాలు
Social Media
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jun 06, 2022 | 1:32 PM

కరోనా(Corona) కారణంగా జీవనశైలిలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి జీవితాల్లో మార్పు అనివార్యమైంది. ముఖ్యంగా విద్యారంగంపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. ఆన్ లైన్ లో(Online Teaching) విద్యాబోధనతో సాంకేతికత కొత్త పుత్తలు తొక్కుతోంది. విద్యార్థుల చేతికి ఫోన్లు, ల్యాప్ టాప్స్, ఇంటర్నె్ట్ చేరాయి. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా వాటికి అలవాటైపోతున్నారు. ముఖ్యంగా సోషల్‌ మీడియా(Social Media) ప్రభావం అందరిలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. సాంకేతికత పిల్లల్లో ఏవిధమైన ప్రభావాన్ని చూపిస్తుందనే విషయంపై సర్వేలు, పరిశోధనలు హెచ్చరికలు విడుదల చేస్తూనే ఉన్నాయి. వీడియో గేమ్స్‌, సోషల్‌ మీడియా పిల్లలపై సానుకూల ప్రభావం చూపిస్తోందని 40శాతం మంది తల్లిదండ్రులు భావిస్తున్నారు. అయినప్పటికీ ఆన్ లైన్ బోధనను తగ్గించి, ఆఫ్ లైన్ లో బోధించాలని 80శాతం మంది తల్లిదండ్రులు చెబుతుండటం గమనార్హం. పియర్‌సన్‌ గ్లోబల్‌ లెర్నర్స్‌ నిర్వహించిన ఈ సర్వేలో కీలక విషయాలు వెల్లడయ్యాయి.

తమ పిల్లలపై సోషల్‌ మీడియా సానుకూల ప్రభావమే చూపుతోందని 30శాతం మంది తల్లిదండ్రులు చెబుతుండగా.. వీడియో గేమ్స్ కూడా సానుకూల ప్రభావమే చూపిస్తోందని 40 శాతం మంది వివరించారు. వర్చువల్‌ విధానంలో బోధన చిన్నారులపై సానుకూల ప్రభావమే కనిపిస్తోందని 27శాతం మంది అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి