Pakistan: సైన్యం ముందు తలవంచిన ఇమ్రాన్ ఖాన్.. ఐఎస్ఐ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ నదీమ్ అహ్మద్ అంజుమ్ ఖరారు!
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి సైన్యం ముందు మోకరిల్లారు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ నదీమ్ అహ్మద్ అంజుమ్ పేరును ఖాన్ ఆమోదించారు.
Pakistan: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి సైన్యం ముందు మోకరిల్లారు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ నదీమ్ అహ్మద్ అంజుమ్ పేరును ఖాన్ ఆమోదించారు. ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా అక్టోబర్ 6న అంజుమ్ పేరును ఇమ్రాన్‌కు పంపారు. ఇమ్రాన్ తనకు ఇష్టమైన జనరల్ ఫైజ్ హమీద్‌ను ఐఎస్‌ఐ చీఫ్‌గా కొనసాగించాలనుకున్నారు. కానీ 20 రోజుల తర్వాత ఆయన సైన్యం ముందు లొంగిపోయారు. నదీమ్‌ను నియమిస్తూ మంగళవారం ఫైలుపై ఖాన్ సంతకం చేశారు.
బజ్వా ఇమ్రాన్‌ను కలుసుకున్నట్లు పాక్ వార్తా సంస్థ తెలిపింది. జనరల్ బజ్వా మంగళవారం ప్రధానమంత్రిని కలిసారు ఈ సందర్భంగా కొత్త ISI చీఫ్‌గా జనరల్ నదీమ్ పేరును ఆమోదించారు. కొంత సమయం తర్వాత ఇమ్రాన్ ఫైల్‌పై సంతకం చేశారు. ఐఎస్‌ఐ పగ్గాలు వేరొకరికి ఇవ్వాలని ప్రధాని భావించినప్పుడు పాకిస్తాన్ చరిత్రలో తొలిసారిగా ఆర్మీ చీఫ్ వేరొకరి పేరును ఫార్వార్డ్ చేయడం గమనార్హం. ప్రధానమంత్రిఇమ్రాన్, ఆర్మీ చీఫ్ మధ్య జరుగుతున్న ఈ టగ్ ఆఫ్ వార్ గురించి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇమ్రాన్‌ను కుర్చీలో కూర్చోబెట్టిన ఆర్మీ ఇప్పుడు ఖాన్‌తో గట్టిగా విభేదిస్తోందని కథనాలు మీడియాలో నిత్యం వస్తూనే ఉన్నాయి.
కాబూల్ నుండి ప్రారంభమైన కథ..
మీడియా నివేదికల ప్రకారం, ఐఎస్ఐ చీఫ్ జనరల్ ఫైజ్ హమీద్ గత నెలలో ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా నుండి అనుమతి తీసుకోకుండానే కాబూల్ వెళ్ళారు. అక్కడ, తాలిబన్ నాయకులతో పాటు, సెరెనా హోటల్‌లో జరిగిన టి-పార్టీకి హాజరయ్యారు. అక్కడ తాలిబన్ల పాలనను నెలకొల్పేందుకు ఆయన సహకరించారని ఆరోపణలు ఎదుర్కున్నారు. జనరల్ ఫైజ్ ఇమ్రాన్ ఖాన్ ఎంపిక చేసిన వ్యక్తి. ఆయన కాబూల్ పర్యటనపై జనరల్ బజ్వాతో పాటు అమెరికా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఐఎస్ఐ చీఫ్ ను నియమించే అధికారం ప్రధానికి ఉంది. ఆవిధంగానే ఇమ్రాన్ ఫైజ్ ను ఐఎస్ఐ చీఫ్ గా చేశారు. అయితే, ఆయన్ను ఇప్పుడు తొలగించారు. ఆర్మీ చీఫ్ సలహా మేరకే ప్రధాని ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. అందువల్ల బజ్వా సలహా మేరకే జనరల్ హమీద్‌ను తొలగించారని చెప్పవచ్చు. అయితే, ఫైజ్‌ను తొలగించేందుకు ఇమ్రాన్ మొదట్లో అసలు అంగీకరించలేదు.
జనరల్ ఫైజ్ హమీద్ ఇలా చిక్కుకున్నారు..
కాబూల్‌తో పాటు దాదాపు మొత్తం ఆఫ్ఘనిస్తాన్‌ను ఆగస్టు 15న తాలిబన్ స్వాధీనం చేసుకుంది. పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్‌ఐ తాలిబన్‌లకు అన్ని విధాలా సహాయం చేస్తున్నాయని ప్రపంచం అప్పటికే అనుమానిస్తూ వచ్చింది. ఈ నేపధ్యంలో సెప్టెంబర్ ప్రారంభంలో, జనరల్ ఫైజ్ హమీద్ నిశ్శబ్దంగా కాబూల్ చేరుకున్నారు. ఇక్కడ ఒకే ఒక ఫైవ్ స్టార్ హోటల్ ఉంది. దాని పేరు సెరెనా హోటల్. ఇక్కడ అతను తన చేతిలో టీ కప్పుతో తాలిబాన్ అగ్ర నాయకులతో కబుర్లు చెప్పాడు. అయితే, ఈ హోటల్‌లో బ్రిటన్‌కు చెందిన ఓ మహిళా జర్నలిస్టు ఉన్నారు. ఫైజ్ ఫోటోలు తీయడమే కాకుండా కొన్ని ప్రశ్నలు కూడా అడిగాడు. దానికి సమాధానంగా ఫైజ్ అంతా బాగానే ఉంది అని సమాధానం ఇచ్చారు. దీని తరువాత ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపించింది. దీంతో పాక్ ఆర్మీ చీఫ్ తో పాటు అమెరికా కూడా కలత చెందింది. అప్పటి నుంచి జనరల్ ఫైజ్ హమీద్ ను తొలగించాలని ఇమ్రాన్‌పై ఒత్తిడి పెరుగుతూ వచ్చింది.
ఇవి కూడా చదవండి: NASA: అంగారకుడిపై తన 14వ మిషన్ విజయవంతంగా పూర్తి చేసిన నాసా ఇంజినిటీ హెలికాప్టర్
Pearl Farming: బకెట్లలో ముత్యాల సాగుబడి.. తక్కువ పెట్టుబడితో అధిక రాబడి.. ఎలానో తెలుసుకుందాం రండి!
LIC: అధికరాబడి వచ్చే ఇన్సూరెన్స్ పథకం కోసం చూస్తుంటే.. మీకోసమే ఈ ఎల్ఐసీ పాలసీ.. పూర్తి వివరాలివే!