అక్కడ లీటరు పెట్రోల్ రూ.118.. డీజిల్ ధర రూ.132!
తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలను వరుసగా రూ. 5.15, రూ.5.65 మేర పెంచుతూ పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశం ఆర్ధికంగా తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలోనే అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇంధన ధరలను పెంచాలంటూ ఆయిల్, గ్యాస్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఓజీఆర్ఏ) చేసిన అభ్యర్థనకు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆమోదం తెలిపారు. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.117.83కి చేరగా… డీజిల్ ధర రూ. 132.47కు చేరుకుందని స్థానిక […]

తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలను వరుసగా రూ. 5.15, రూ.5.65 మేర పెంచుతూ పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశం ఆర్ధికంగా తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలోనే అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇంధన ధరలను పెంచాలంటూ ఆయిల్, గ్యాస్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఓజీఆర్ఏ) చేసిన అభ్యర్థనకు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆమోదం తెలిపారు. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.117.83కి చేరగా… డీజిల్ ధర రూ. 132.47కు చేరుకుందని స్థానిక మీడియా వెల్లడించింది.
పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు కిరోసిన్, లైట్ డీజిల్ ధరలు కూడా వరుసగా రూ.5.38, రూ.8.90 మేర పెరిగాయి. దీంతో కిరోసిన్ ధర రూ.132.47కి చేరుకోగా, లైట్ డీజిల్ ధర రూ.103.84కి పెరిగింది. కాగా ఇంధన ధరల పెంపుపై పాక్ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.