J-10C fighters: వానపాములా బుసలు.. చైనా యుద్ద విమానాల కోసం పాక్ తహతహలు..
పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందనే సామెతను మరోసారి నిరూపించుకుంది పాకిస్తాన్. భారత్ కొనుగోలు చేసిన అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలను పోటీగా పాకిస్తాన్ డ్రాగన్ కంట్రీ చైనాకు చెందిన మల్టీరోల్ జే-10సీ యుద్ధ..
పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందనే సామెతను మరోసారి నిరూపించుకుంది పాకిస్తాన్. భారత్ కొనుగోలు చేసిన అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలను పోటీగా పాకిస్తాన్ డ్రాగన్ కంట్రీ చైనాకు చెందిన మల్టీరోల్ జే-10సీ యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది. ఈ రకం విమానాలను మొత్తం 25 కొనుగోలు చేసినట్టు పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి షైక్ రషీద్ అహ్మద్ వెల్లడించాడు. ప్రతికూల వాతావరణంలోనూ సమర్ధంగా పనిచేసే ఈ ప్రత్యేక విమానాలు వచ్చే ఏడాది మార్చి 23న పాక్ జాతీయ దినోత్సవం రోజున వైమానిక దళంలో చేరనున్నాయని వెల్లడించాడు.
తన మిత్రదేశాన్ని రక్షించడానికి వస్తున్న చైనా తన నమ్మకమైన యుద్ధ విమానాలలో ఒకదానిని పాకిస్తాన్‌కు అందించింది. అంతర్జాతీయ విపణిలో మిత్రపక్షంగా ఉన్నందుకు కృతజ్ఞతగా చైనా వీటిని అందిస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఇవి తామే స్వయంగా కొనుగోలు చేస్తున్నట్లుగా కలరింగ్ ఇస్తోంది పాకిస్తాన్. కొంతమంది పాకిస్తాన్ నాయకులు మరింత రెచ్చిపోయి ప్రకటనలు ఇస్తున్నారు.
భారతదేశం రాఫెల్ జెట్‌లకంటే తమవే మెరుగ్గా ఉన్నాయని అంటున్నారు. తన ప్రముఖ ఆంగ్ల-మీడియం సహోద్యోగులను ఎగతాళి చేయడానికి తనను తాను ‘ఉర్దూ-మీడియం విద్యాసంస్థల గ్రాడ్యుయేట్’ అని చెప్పుకునే ఓ పాకిస్తాన్ మంత్రి అతి ఉత్సాహం ప్రదర్శించాడు. జెట్ పేరును తప్పుగా ప్రకటించాడు.. దానిని J-10Cకి బదులుగా JS-10 అంటూ వెల్లడించాడు. ఆయన చెసిన కామెంట్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
ఇక, గతేడాది డిసెంబరు 7 న ప్రారంభమైన ఈ విన్యాసాలు 20 రోజులపాటు సాగాయి. చైనాకు చెందిన జే-10సీ, జే-11బీ యుద్ధ విమానాలు సహా కేజే-500 వంటి ముందస్తు హెచ్చరికల విమానాలు ఇందులో పాల్గొన్నాయి. పాక్ నుంచి జేఎఫ్-17, మిరేజ్-3 వంటి యుద్ధ విమానాలు పాల్గొన్నాయి.
పాక్ వద్ద అమెరికా నుంచి కొనుగోలు చేసిన ఎఫ్-16ఎస్ యుద్ధ విమానాలు ఉన్నాయి. అయితే, ప్రస్తుతం భారత్ వద్ద ఉన్న అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలను ధీటుగా ఎదుర్కొవాలంటే ప్రతికూల వాతావరణంలోనూ సమర్ధంగా పనిచేసే ఫైటర్ జెట్ల కోసం పాక్ ఎదురుచూస్తోంది. అందులో భాగంగా చైనా నుంచి జే-10సీ విమానాలను కొనుగోలు చేసింది.
ఇవి కూడా చదవండి: Egg Kebab Recipe: మీకు ఎగ్ అంటే ఇష్టమా.. న్యూ ఇయర్ వేడుకల కోసం అదిరిపోయే రెసిపీ..
Somu Veerraju: దేశ ద్రోహులపేర్లను తొలిగించండి.. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కామెంట్స్