India vs china: మరో కుట్రకు తెరలేపిన చైనా.. అరుణాచల్ ప్రదేశ్‌లోని 15 ప్రదేశాల పేర్లు మార్పు.. ధీటుగా బదులిచ్చిన భారత్..!
Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగమని, కల్పిత పేర్లను ప్రకటించడం వల్ల వాస్తవాలు మారవని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి చైనాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.
India vs china: భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్‌లో మరో 15 ప్రదేశాలకు చైనా భాషలోని అక్షరాలు, టిబెటన్, రోమన్ వర్ణమాలల పేర్లను చైనా ప్రకటించింది. దీనిపై భారత్ ఘాటుగా స్పందించింది. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగమని, కల్పిత పేర్లను ప్రకటించడం వల్ల వాస్తవాలు మారవని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి చైనాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.
మీడియా అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి మాట్లాడుతూ, మేం అలాంటి నివేదికలను చూశాం. అరుణాచల్ ప్రదేశ్‌లోని స్థలాల పేర్లను మార్చేందుకు చైనా ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదని, 2017 ఏప్రిల్‌లో కూడా చైనా అలాంటి పేర్లను కోరిందని ఆయన అన్నారు. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగంగా ఉంటుందని, కొత్త పేర్లతో వాస్తవాలు మారవని ఆయన ఉధ్ఘాటించారు.
15 స్థలాల పేర్లలో మార్పులు.. చైనీస్ అక్షరాలు, టిబెటన్, రోమన్ వర్ణమాలలో అరుణాచల్ ప్రదేశ్‌కు చైనీస్ పేరు అయిన జాంగ్నాన్‌గా 15 స్థలాల పేర్లను మార్చినట్లు చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. చైనా ప్రభుత్వ గ్లోబల్ టైమ్స్ గురువారం దీనిని వెల్లడించింది.
వీటిలో ఎనిమిది నివాస స్థలాలు.. ఇది చైనా క్యాబినెట్ ‘స్టేట్ కౌన్సిల్’ జారీ చేసిన భౌగోళిక పేర్లపై నిబంధనలకు అనుగుణంగా ఉందని వార్తల్లో పేర్కొంది. ఖచ్చితమైన రేఖాంశం, అక్షాంశం ఇచ్చిన 15 ప్రదేశాల అధికారిక పేర్లలో ఎనిమిది నివాస స్థలాలు, నాలుగు పర్వతాలు, రెండు నదులు, ఒక పర్వత మార్గం ఉన్నాయి.
2017లోనే కుట్రకు పన్నాగాలు.. చైనా ఇలాంటి కుట్రను చేయడం ఇదే తొలిసారి కాదు. 2007లోనూ ఇలాంటి పన్నాగాలకు ప్రయత్నించింది. ఆరు స్థలాల ప్రామాణిక పేర్లు 2017లో మొదట జారీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్‌ను దక్షిణ టిబెట్‌గా చైనా పేర్కొంటోంది. దీనిని విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా తిరస్కరించింది.
ఎల్‌ఓసీతోనే వివాదాలు.. తన వాదనను రుజువు చేసేందుకు అరుణాచల్ ప్రదేశ్‌లో భారత అగ్రనేతలు, అధికారుల పర్యటనలను చైనా క్రమం తప్పకుండా వ్యతిరేకిస్తోంది. భారతదేశం, చైనా సరిహద్దులో 3,488-కిమీల పొడవు గల వాస్తవ నియంత్రణ రేఖను పంచుకుంటున్నాయి. ఇది రెండింటి మధ్య వివాదంగా మారింది.
గ్లోబల్ టైమ్స్ వార్తల ప్రకారం, చైనా ప్రామాణీకరించిన ఎనిమిది స్థల పేర్లు షానన్ ప్రాంతంలోని కోనా కౌంటీలో సెంగ్‌కేజోంగ్, దగ్లుంగ్‌జాంగ్, నైంగ్‌చిలోని మెడోగ్ కౌంటీలోని మణిగ్యాంగ్, డ్యూడింగ్, మిగ్‌పెన్, జియు కౌంటీలోని గోలింగ్, డాంగా, షానాన్, లుంఘే కౌంటీ ప్రిఫెక్చర్‌లో చేర్చింది. నాలుగు పర్వతాలు వామోరి, డ్యూ రి, లుంగ్‌జుబ్ రి, కున్‌మింగ్‌సింగ్జే ఫాంగ్ అని పేర్కొంది. షియోంగ్మో హీ, దులన్ హీ అనే రెండు నదుల పేర్లు ప్రమాణీకరించింది. అలాగే కోనా కౌంటీలోని పర్వత మార్గం పేరును కూడా ఇందులో చేర్చింది.
Also Read: J-10C fighters: వానపాములా బుసలు.. చైనా యుద్ద విమానాల కోసం పాక్ తహతహలు..