AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Putin Naked Beer: మార్కెట్‌లోకి కొత్త రకం బీర్‌.. ఎగబడి కొంటున్న పుతిన్ వ్యతిరేకులు.. ఎందుకో తెలుసా?

పుతిన్‌ను గేలి చేస్తూ మార్కెట్‌లోకి ఓ బీర్‌ వచ్చింది.. ఉక్రెయిన్‌ కోసం నిధులు సేకరించేందుకే ఈ డ్రింక్‌ అంటున్నారు దీని తయారీదారులు..

Putin Naked Beer: మార్కెట్‌లోకి కొత్త రకం బీర్‌.. ఎగబడి కొంటున్న పుతిన్ వ్యతిరేకులు.. ఎందుకో తెలుసా?
Putin Naked Beer
Balaraju Goud
|

Updated on: May 03, 2022 | 7:40 AM

Share

Putin Naked Beer: పుతిన్‌ను గేలి చేస్తూ మార్కెట్‌లోకి ఓ బీర్‌ వచ్చింది.. ఉక్రెయిన్‌ కోసం నిధులు సేకరించేందుకే ఈ డ్రింక్‌ అంటున్నారు దీని తయారీదారులు.. పుతిన్ హుయ్‌.. ఈ అక్షరాలతో పాటు ‘పుతిన్‌ ఈజ్‌ ఏ.. ‘ అంటూ కొన్ని బూతు పదాలు.. వీటితో పాటు ఆ బీరు డబ్బా మీద రష్యా అధ్యక్షుడు పుతిన్‌ నగ్నంగా కనిపించే కారికేచర్‌ లేబుల్‌.. అమెరికా వర్జీనియాలో అమ్మకానికి పెట్టారు ఈ బీరు డబ్బాలను.. ఆ షాపుకు వచ్చిన మందు బాబులంతా కసిగా ఆ బీర్‌ తాగుతున్నారు.. పుతిన్‌ మీద ప్రేమతో కాదు.. తిట్టుకుంటూ మరీ తాగుతున్నారు.. అసలు ఎందుకు పుతిన్‌కు తిడుతూ ఈ బీర్‌ తయారు చేస్తున్నారు? అసలు ముచ్చట వారే చెబుతున్నారు..

ఉ్రకెయిన్‌ మీద రష్యా అన్యాయంగా యుద్దానికి దిగిందని ఆగ్రహంతో ఉన్నారు అమెరికన్ మందు బాబులు.. యుద్దంతో కష్టనష్టాలు ఎదుర్కొంటున్న ఉక్రెయిన్‌ ప్రజల కోసం తమ వంతుగా ఏమైనా చేయాలని భావించారు.. ఇందు కోసమే పుతిన్‌ వ్యంగ్య చిత్రం ఉన్న లేబుల్‌ బీర్‌ టిన్స్‌కు చుట్టి అమ్ముతున్నారు.. ఈ యాంటీ పుతిన్‌ లేబుట్‌ బీర్‌ పశ్చిమ ఉక్రెయిన్‌ ఎల్వివ్‌లోని ప్రావ్దా బ్రూవరీ కంపెనీది.. ఈ బీర్‌ అమ్మకంతో వచ్చిన లాభాలను ఉక్రెయిన్‌ కోసం పని చేస్తున్న మానవతావాదులకు ఇస్తామని చెబుతున్నారు తీయారీదారులు.. సుమారు 20 వేల అమెరికన్‌ డాలర్లు సేకరించాలని వీరి లక్ష్యం

మరోవైపు ఉక్రెయిన్‌లోని ప్రావ్దా బ్రూవరీ కంపెనీ యుద్ధం ప్రారంభం కాగానే బీరు, ఇతర కాక్‌టెయిల్‌ డ్రింగ్స్‌ ఉత్పత్తిని ఆపేసింది.. వీటిని బదులుగా బీరు సీసాలను పెట్రోల్‌ బాంబుల తయారీకి ఉపయోగిస్తున్నారు.. స్థానికులు పెట్రోల్‌ బాంబులను రష్యన్‌ సైనికుల మీదకు విసురుతున్నారు.. రష్యన్ల నుంచి దేశాన్ని రక్షించుకోవడానికి తమ వంతుగా ఈ పని చేస్తున్నామని చెబుతున్నారు..

Read  Also…  Arun Lal: 66 ఏళ్ల వయస్సులో ప్రేమ వివాహం చేసుకున్న మాజీ క్రికెటర్‌.. వైరల్‌ అవుతున్న ఫొటోలు..