మళ్ళీ క్షిపణి ప్రయోగాల్లో నార్త్ కొరియా బిజీ, నింగికెగసిన రెండు స్వల్ప దూర మిసైల్స్, పట్టించుకోని యూఎస్
ఇన్నాళ్లూ తమ క్షిపణి ప్రయోగాల విషయంలో స్తబ్దంగా ఉన్న ఉత్తర కొరియా మళ్ళీ వీటికి పూనుకొంది. తాజాగా రెండు మిసైళ్లను ప్రయోగించింది. అయితే ఇవి తక్కువ దూరం ప్రయాణించే క్షిపణులు. అయితే....
ఇన్నాళ్లూ తమ క్షిపణి ప్రయోగాల విషయంలో స్తబ్దంగా ఉన్న ఉత్తర కొరియా మళ్ళీ వీటికి పూనుకొంది. తాజాగా రెండు మిసైళ్లను ప్రయోగించింది. అయితే ఇవి తక్కువ దూరం ప్రయాణించే క్షిపణులు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి టెస్టింగ్ నిషేధాల పరిధి కిందకు ఇలాంటివి రావని తెలిసి నార్త్ కొరియా వీటిని ప్రయోగించినట్టు తెలుస్తోంది. కరోనా వైరస్ కారణంగా గత ఏడాదిఅంతా ఈ దేశం వీటి గురించి ఆసక్తి చూపలేదు. కానీ పొరుగు దేశాల నుంచి ఈ మహమ్మారిని తమ దేశంలోకి రాకుండా కట్టడి చేయగలిగిన నార్త్ కొరియా.. తాజాగా తిరిగి ఈ ప్రయోగాల వైపు దృష్టి పెట్టింది. ఇప్పటికే అణ్వయుధాలతో కూడిన బాలిస్టిక్ మిసైళ్లను లోగడ ఈ దేశం చాలాసార్లు ప్రయోగించింది. ఇందుకు ఇతర దేశాల నుంచి ఛీత్కారాలను ఎదుర్కొంది. ఆంక్షలకు కూడా గురైంది. 2017 తరువాత మాత్రం ఈ విధమైన ప్రయోగాలు చేయలేదు. కాగా గత జనవరిలో అమెరికా అధ్యక్షునిగా జోబైడెన్ అధికార పగ్గాలను చేపట్టాక ఉత్తర కొరియా మిసైళ్ళ ప్రయోగం చేపట్టడం ఇదే మొదటిసారి. అయితే ఈ లాంచింగ్ ని బైడెన్ సింపుల్ గా పరిగణించారు. ఇదేమంత పెద్ద విషయం కాదని అన్నారు. నార్త్ కొరియాతో తాము అవసరమైతే చర్చలు జరుపుతామని, ఈ ప్రయోగాలు వారి సాధారణ దైనందిన వ్యవహారాల్లో భాగమని ఆయన వ్యాఖ్యానించారు.
అయితే నార్త్ కొరియా అధినేత కిమ్ మాత్రం ఇప్పటికీ అమెరికా అంటే గుర్రుగానే ఉన్నారు. ఒకప్పుడు యూఎస్ మాజీ అధ్యక్షుడు ట్రంప్ తో చర్చలు సాగించినా ఆ తరువాత ఆయన మాజీ అయ్యాక అమెరికాతో నార్త్ కొరియా దౌత్య సంబంధాలు మరింత క్షీణించాయి. బైడెన్ కూడా తమ విదేశాంగ విధానంలో నార్త్ కొరియా కు అంతగా ప్రాముఖ్యమివ్వలేదు. అయితే జపాన్, సౌత్ కొరియా వంటి తమ మిత్ర దేశాలతో సంబంధాలను మరింత పెంచుకోవడానికి ఆయన ప్రాధాన్యమిస్తున్నారు. మరిన్ని చదవండి ఇక్కడ : Covid :దేశవ్యాప్తంగా మరోసారి కరోనా కరాళనృత్యం..మూతపడుతున్న స్కూల్స్.. మాల్స్ రెస్టారెంట్లపై ఆంక్షలు(వీడియో ) ‘నాకు తెలుసు సుశాంత్ నువ్వు ఇదంతా చూస్తున్నావని’ నవీన్ పోలిశెట్టి ఎమోషనల్ పోస్ట్ : Naveen Polishetty video.