North Korea: మళ్ళీ అణ్వాయుధాలు సిద్ధం చేస్తున్న ఉత్తర కొరియా..ఆందోళనలో ప్రపంచ దేశాలు
ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ మరోసారి తన అణు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం ప్రారంభించారు. అణ్వాయుధాలను కలిగి ఉన్న ఉత్తర కొరియా, యోంగ్‌బియాన్ ప్లాంట్‌లో ప్లూటోనియంను ప్రాసెస్ చేస్తోంది.
North Korea: ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ మరోసారి తన అణు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం ప్రారంభించారు. అణ్వాయుధాలను కలిగి ఉన్న ఉత్తర కొరియా, యోంగ్‌బియాన్ ప్లాంట్‌లో ప్లూటోనియంను ప్రాసెస్ చేస్తోంది. దీనిని అణ్వాయుధాల తయారీకి ఉపయోగిస్తారు. యోంగ్‌బియాన్ ప్లాంట్‌లో ఉత్తర కొరియాలో అతిపెద్ద 5 మెగావాట్ల న్యూక్లియర్ రియాక్టర్ ఉంది. డిసెంబర్ 2018 నుండి రియాక్టర్ మూసివేశారు. ఐక్యరాజ్య సమితి అణు సంస్థ తన వార్షిక నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది.
ఉత్తర కొరియా ఈ చర్యపై ఏజెన్సీ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ‘ప్రపంచం వెంటనే ఉత్తర కొరియాతో మాట్లాడాలి’ అని అంతర్జాతీయ అణు శక్తి సంస్థ ప్రతినిధి అన్నారు. అదే సమయంలో, అమెరికాతో సుదీర్ఘకాలంగా నిద్రాణమైన అణు దౌత్యం మధ్య.. ఉత్తర కొరియా తన అణు ఆయుధాలను పెంచుతామని బహిరంగంగా బెదిరించింది. నియంత కిమ్ జాంగ్ ఉన్ నాయకత్వంలో ఉత్తర కొరియా అణు కార్యక్రమం వేగంగా అభివృద్ధి చెందిందని అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (IAEA) తెలిపింది. ఈ కారణంగా, గతంలో అనేక సార్లు అంతర్జాతీయ ఆంక్షలు ఈ దేశంపై విధించారు.
ఉత్తర కొరియా జూలై నుండే అణ్వాయుధాల తయారీపై సంకేతాలను ఇవ్వడం ప్రారంభించిందని ఏజెన్సీ తెలిపింది. యోంగ్‌బియాన్ ప్లాంట్ నుంచి భారీ మొత్తంలో చల్లటి నీరు విడుదల అవుతోంది. ఇక్కడ క్రమం తప్పకుండా వాహనాల రాకపోకలు ఉండేవి.ప్రస్తుతం రాకపోకలపై నిషేధం విధించారు. దీంతో రాకపోకలు ఆగిపోయాయి. ఈ చర్యలతో అక్కడ అణు రియాక్టర్ పని ప్రారంభించిందని స్పష్టమైంది. యోంగ్‌బియాన్ ఇతర ప్రధాన అణు ఇంధనం అయిన అత్యంత సుసంపన్నమైన యురేనియంను కూడా ఉత్పత్తి చేస్తుంది.
యుఎన్ 2009 నుండి ఉత్తర కొరియాను పర్యవేక్షిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అణు కేంద్రాలను అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (UN ఏజెన్సీ) పర్యవేక్షిస్తుంది. అదేవిధంగా ఉత్తర కొరియాలోనూ ఈ సంస్థ పనిచేసేది. అయితే, 2019 లో ఉత్తర కొరియా దేశం నుండి ఈ సంస్థను బహిష్కరించారు. అప్పటి నుండి, ఏజెన్సీ ఈ ప్రదేశాలను బయటి మూలాల నుండి పర్యవేక్షిస్తోంది. ఉపగ్రహాల ద్వారా ఎప్పటికప్పుడు ఉత్తర కొరియా అణు సంనద్ధతపై పరిశీలన జరుపుతోంది అంతర్జాతీయ అణు శక్తి సంస్థ.