AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

News9 Global Summit: ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నవి అవే.. న్యూస్‌9 గ్లోబల్‌ సమ్మిట్‌లో బరుణ్‌దాస్‌ కీలక ప్రసంగం..

జర్మనీలోని స్టట్‌గార్ట్‌లో జరుగుతున్న న్యూస్9 గ్లోబల్ సమ్మిట్‌లో ఈరోజు (శుక్రవారం) ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. అంతకు ముందు టీవీ9 నెట్‌వర్క్ ఎండీ, సీఈఓ బరుణ్ దాస్ కీలక ప్రసంగం చేశారు. నేడు రెండు ముఖ్యమైన అంశాలు ప్రపంచాన్ని వేగంగా ప్రభావితం చేస్తున్నాయన్న ఆయన.. ఒకటి వాతావరణ మార్పు, మరొకటి కృత్రిమ మేధస్సుగా పేర్కొన్నారు.

News9 Global Summit: ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నవి అవే.. న్యూస్‌9 గ్లోబల్‌ సమ్మిట్‌లో బరుణ్‌దాస్‌ కీలక ప్రసంగం..
Tv9 Network MD, CEO Barun Das in News9 Global Summit 2024
Subhash Goud
|

Updated on: Nov 22, 2024 | 3:22 PM

Share

జర్మనీలోని చారిత్రాత్మక స్టుట్‌గార్ట్ స్టేడియంలో జరుగుతున్న న్యూస్‌9 గ్లోబల్ సమ్మిట్‌లో రెండవ రోజు టీవీ9 నెట్‌వర్క్ ఎండీ, సీఈఓ బరుణ్‌ దాస్ కీలక ప్రసంగం చేశారు. నేడు రెండు ముఖ్యమైన అంశాలు ప్రపంచాన్ని వేగంగా ప్రభావితం చేస్తున్నాయన్న ఆయన.. ఒకటి వాతావరణ మార్పు, మరొకటి కృత్రిమ మేధస్సుగా పేర్కొన్నారు. ప్రపంచంలోని రెండు గొప్ప దేశాలైన భారత్, జర్మనీలు ఈ దిశగా సానుకూల కార్యక్రమాలతో ముందుకు సాగడం సంతోషంగా ఉందన్నారు.

జర్మనీలోని స్టట్‌గార్ట్‌లో జరుగుతున్న న్యూస్9 గ్లోబల్ సమ్మిట్‌లో ఈరోజు (శుక్రవారం) ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. అంతకు ముందు టీవీ9 నెట్‌వర్క్ ఎండీ, సీఈవో బరుణ్ దాస్ రెండు రోజు సదస్సులో ప్రారంభోపన్యాసం చేశారు. తన ప్రసంగంలో వాతావరణ మార్పులు, కృత్రిమ మేధస్సుకు సంబంధించి ముఖ్యమైన అంశాలను ప్రస్తావించారు. జర్మనీలో తీవ్రమైన చలిని కూడా లెక్క చేయకుండా న్యూస్9 గ్లోబల్ సమ్మిట్‌కు అతిథుల హాజరు కావడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సదస్సులో తొలిరోజు పాల్గొన్న కేంద్ర మంత్రులు అశ్వనీ వైష్ణవ్, జ్యోతిరాదిత్య సింధియాలకు బరుణ్ దాస్ కృతజ్ఞతలు తెలిపారు. భారత్, జర్మనీ వంటి రెండు గొప్ప దేశాలు ద్వైపాక్షిక సహకారం ఎంత ఉత్సాహంగా కొనసాగిస్తున్నాయో ఇరువురు మంత్రుల ప్రసంగం తెలియజేస్తోందని ఆయన అన్నారు.

కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తన ప్రసంగంలో భారతదేశం, జర్మనీల మధ్య బలమైన సంబంధాలను ఎత్తిచూపారని బరుణ్‌ దాస్ గుర్తు చేశారు. భారత్‌, జర్మనీల మధ్య బలపడిన బంధం విశ్వాసం, ఆదర్శాలు, విలువలతో కూడినదని జ్యోతిరాదిత్య సింధియా అన్నారని గుర్తు చేశారు. ప్రపంచంలో విశ్వాసం, ప్రతిభ, స్థిరత్వం అందించడంలో భారతదేశం ప్రసిద్ధి చెందిందని అశ్వనీ వైష్ణవ్ అన్నారని ప్రస్తావించారు. అశ్వనీ వైష్ణవ్, జ్యోతిరాదిత్య సింధియాతో పాటు, బరుణణ్‌ దాస్ కూడా బాడెన్-వుర్ట్‌బెర్గ్ వంటి ప్రదేశంలో నిర్వహిస్తున్న సదస్సు పట్ల ఇరు దేశాల కార్పొరేట్ ప్రముఖులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.

బరుణ్‌ దాస్ తన ప్రసంగంలో భారత్‌ ప్రపంచ వేదికపై అభివృద్ధి చెందిన దేశంగా ఎలా నిలుస్తోందో వివరించారు. భారత్ సుస్థిర అభివృద్ధిలో జర్మనీ ఎలా బలమైన భాగస్వామిగా ఉందో వివరించారు. దీనిపై రెండో రోజు సదస్సులో కూడా లోతుగా చర్చిస్తామని చెప్పారు.

న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ గౌరవార్థం ప్రధాని నరేంద్ర మోదీ లంచ్ పార్టీని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. దీనికి కొనసాగింపుగా ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం అయ్యేలా న్యూస్ 9 గ్లోబల్ సమ్మిట్‌ జర్మనీలో నిర్వహించడం విశేషమన్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలు భూమికి, పర్యావరణానికి మేలు చేస్తాయన్నారు.

దీనితో పాటు, తన ప్రసంగంలో, బరుణ్‌ దాస్ వాతావరణ మార్పులకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను కూడా ప్రస్తావించారు. నేడు వాతావరణ మార్పుల వల్ల మానవజాతి తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటోందన్నారు. ప్రపంచం మొత్తం దాని ప్రభావానికి గురవుతున్నాయన్నారు. వాతావరణ మార్పుతో జరిగే అనర్థాల విషయంలో ఎవరికి బేధాభిప్రాయాలు లేవన్నారు. చెన్నై వరదల నుండి స్పెయిన్‌లోని వాలెన్సియా వరకు వాతావరణ మార్పుల దుష్ప్రభావాల గురించి ప్రతి ఒక్కరికీ తెలుసని బరుణ్‌దాస్‌ అన్నారు.

వాతావరణ మార్పులకు ఎవరు బాధ్యత వహిస్తారనేది పెద్ద ప్రశ్నగానే మిగిలిపోయిందన్నారు. విభా ధావన్, అజయ్ మాథుర్ వంటి అధికారులు COP29 లో ఉన్నారని, వారు కూడా ఈ సమ్మిట్‌లో పాల్గొన్నారని, అందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. నేడు వాతావరణ మార్పుల విపత్తు ధనిక, పేద అనే తేడా లేకుండా అందరినీ ప్రభావితం చేసిందన్నారు. ఈ నేపథ్యంలో ఈ సదస్సులో జర్మనీ ఫెడరల్ మినిస్టర్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ సెమ్ ఓజ్డెమిర్ ప్రాముఖ్యత గణనీయంగా పెరుగుతుందని, ఈ శిఖరాగ్ర సమావేశానికి స్వాగతం పలుకుతున్నామని అన్నారు.

వాతావరణ మార్పులతో పాటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిధి, ఉపయోగం గురించి కూడా బరుణ్‌ దాస్ వివరించారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌పై నేడు ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోందని, నేటి భారతదేశం టెక్నాలజీ రంగంలో తన నాయకత్వాన్ని నిరూపించుకోవాలని భావిస్తోందని అన్నారు. దేశం ఆర్థికంగా, సాంకేతికంగా అగ్రరాజ్యంగా ఎదుగుతోంది.

ప్రపంచ కంపెనీలు భారత్ వైపు చూస్తున్నాయని, భారత్‌ వారికి బలమైన ఎంపికగా మారిందని, ఈ నేపథ్యంలో ఈ గ్లోబల్ సమ్మిట్‌లో వేగవంతమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా ప్రపంచ వేదికపై తనదైన ముద్ర వేస్తున్న భారత్‌ గురించి ప్రస్తావించారు.