కరోనాను మళ్లీ ఓడించాంః న్యూజిలాండ్ ప్రధాని
ప్రపంచాన్ని కరోనా మహమ్మారి పట్టిపీడిస్తుంది. ఇలాంటి సమయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో వైరస్ వ్యాప్తిని అడ్డుకుంది న్యూజీలాండ్ ప్రభుత్వం.
ప్రపంచాన్ని కరోనా మహమ్మారి పట్టిపీడిస్తుంది. ఇలాంటి సమయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో వైరస్ వ్యాప్తిని అడ్డుకుంది న్యూజీలాండ్ ప్రభుత్వం. అయినప్పటికీ, విదేశీ ప్రయాణికుల రాకతో దేశంలో మరోసారి వైరస్ వ్యాప్తి కొనసాగింది. అయితే, దేశంలో రెండోసారి లాక్‌డౌన్ తర్వాత కరోనా వైరస్‌ను మళ్లీ ఓడించామని ఆ దేశ ప్రధాని జసిందా ఆర్డర్న్ సోమవారం ప్రకటించారు. 1.2 మిలియన్ల జనాభా ఉన్న ఆక్లాండ్ నగరంలో కరోనా వైరస్ మళ్లీ ఉద్భవించడంతో మూడువారాల పాటు లాక్ డౌన్ అమలు చేశారు. ఆక్లాండ్ నగరంలో గత 12 రోజులుగా కరోనా కేసులు నమోదు కాకపోవడంతో వైరస్ నియంత్రణలోకి వచ్చిందని రెండవ లాక్ డౌన్ భరించిన ఆక్లాండ్ ప్రజలను ప్రధాని అభినందించారు. గతంలో కరోనా వ్యాప్తి చెందకుండా న్యూజిలాండ్ వాసులు.. 102 రోజులపాటు జాతీయ లాక్ డౌన్ ప్రకటించారు. దీంతో ప్రతి ఒక్కరి కొవిడ్ నిబంధనలు పాటించడంతో మే నెల చివరిలో వైరస్ నియంత్రణలోకి వచ్చింది. ఇదిలావుంటే, అక్టోబరు 18న ఆక్లాండులోని జరిగే రెండవ బ్లెడిస్లో కంప్ టెస్టు ఈడెన్ పార్కులోని స్టేడియంలో ఆడేందుకు అనుమతించారు. ఇదిలావుంటే, ఐదు మిలియన్ల జనాభా కలిగిన న్యూజిలాండ్ లో కరోనా రాకాసి బారినపడి కేవలం 25 మంది మాత్రమే ప్రాణాలను కోల్పోయారు.