అల్లర్ల ఎఫెక్ట్.. హోంమంత్రి రమేష్ లేఖక్ రాజీనామా.. అసలు నేపాల్‌లో ఏం జరుగుతుంది!
నేపాల్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి రమేష్ లేఖక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో జరుగుతున్న అల్లర్లకు తానే పూర్తి బాధత్య వహిస్తూ తన పదవికీ ఆయన రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ప్రధానికి అందజేశారు రమేష్ లేఖక్.

నేపాల్ ప్రముఖ సోషల్ మీడియా యాప్స్ అయిన ఫేస్‌బుక్, ఎక్స్, యూట్యూబ్, ఇన్‌స్ట్రాగ్రామ్ వంటి ప్రధాన యాప్స్‌ను బ్యాన్ చేయడం ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి రమేష్ లేఖక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ప్రధానికి అందజేశారు. దేశంలో జరుగుతున్న అలర్లకు తానే పూర్తి బాధ్యత వహిస్తున్నట్లుగా ఆ లేఖలో పేర్కొన్నారు.
అసలు నేపాల్‌లో ఏం జరుగుతుంది.
అయితే దేశంలో రిజిస్టర్ కాకుండా, సొంత ఆఫీస్‌లు ఏర్పాటు చేయకుండా కార్యకాలాపాలు సాగిస్తున్న కొన్ని ఫేస్‌బుక్, ఎక్స్, యూట్యూబ్, ఇన్‌స్ట్రాగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్స్‌పై నేపాల్ ప్రభుత్వం నిషేదాన్ని విధించింది. దీంతో వాటని వాడడం ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. దీంతో ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలను ఆందోళనలు చేపట్టడం మొదలు పెట్టారు. సోమవారం ఏకంగా నేపాల్ రాజధాని కాఠ్మండులో నిరసనకారులు బారికేడ్‌లను ధ్వంసం చేసి పార్లమెంట్‌ను చుట్టుముట్టారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదగొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కొన్ని సందర్భాల్లో టియర్ గ్యాస్, వాటర్ క్యానన్‌లతో వారిని అడ్డుకున్నారు. ఈ ఘర్షణలో దాదాపు 20 మందికి పైగా మృతి చెందగా.. మరో 250 మందికి పైగా తీవ్రంగ గాయపడ్డట్టు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
