”నా ఐ ప్యాడ్ పోయింది… కనబడడం లేదు.. తెచ్చిపెట్టరూ..? సౌతాఫ్రికా ప్రెసిడెంట్ గోడు… ‘చివరికి ఏమైందంటే …?
సౌతాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా ఈ మధ్య ఓ గట్టి చిక్కులోనే పడ్డారు. ఏదో కార్యక్రమంలో పాల్గొనేందుకు పోర్ట్ ఆఫ్ కేప్ టౌన్ కి వచ్చినప్పుడు ఆయన మొదట మీడియాతో మాట్లాడడానికి రెడీ అయ్యారు.

సౌతాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా ఈ మధ్య ఓ గట్టి చిక్కులోనే పడ్డారు. ఏదో కార్యక్రమంలో పాల్గొనేందుకు పోర్ట్ ఆఫ్ కేప్ టౌన్ కి వచ్చినప్పుడు ఆయన మొదట మీడియాతో మాట్లాడడానికి రెడీ అయ్యారు. అయితే తనకు ఎప్పుడూ అందుబాటులో ఉండే తన ఐ ప్యాడ్ కనబడకుండా పోయిందట……దాంతో గాభరా పడి చిన్నపాటి చిందులు వేసినంత పని చేశారు. నా ఐ ప్యాడ్ పోయింది..ఎవరో దొంగిలించారు…దాన్ని చోరీ చేసినవారెవరో గానీ వెంటనే నాకు తిరిగి ఇచ్చేయాలని కోరుతున్నాను అన్నారు. బయటకు ఎప్పుడు వచ్చినా ఈ గాడ్జెట్స్ తో ఇదే ప్రాబ్లమ్ అని కూడా ఆయన విసుక్కున్నారు. కాస్త అసహనం కూడా ప్రదర్శించారు.దీంతో మీడియా కూడా ఆశ్చర్యపోతూ ఏం చేయాలో..ఏం చెప్పాలో తెలియక అయోమయంలో ఉండిపోయింది. కానీ ఆ తరువాత అసలు విషయం ఆ తరువాత తెలిసింది.ఆయనగారి ఐ ప్యాడ్ చోరీకి గురైనట్టు వచ్చిన వార్తను ఆయన కార్యాలయం తోసిపుచ్చింది.
అది చోరీకి గురి కాలేదని..అలాగే మిస్ కాలేదని స్పష్టం చేసింది. తన సహాయకుడు దాన్ని తెచ్చి ఇచ్చేలోగా వేచి ఉండడమెందుకని తమ అధ్యక్షుడు ఇలా సరదాగా దాదాపు జోక్ చేశారని వెల్లడించింది. మొత్తానికి ఈ ఐ ప్యాడ్ ..ఈ ప్రెసిడెంట్ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వైనం చూసి కొందరు ట్విటర్ యూజర్లు…. ఇదేం జోక్ రా బాబూ అనుకున్నారు. సిరిల్ రమాఫోసా యవ్వారం హోంవర్క్ చెయ్యని స్టూడెంట్ మాదిరి ఉంది.. అయినా మీ ఐ ప్యాడ్ ఎలా పోతుంది సామీ అని ఒకరంటే..ఇంకొకరు.. కాస్త జాలిని కూడా ప్రదర్శించారు.తన ఐ ప్యాడ్ విషయంలో కూడా ఆయన మీడియాను ఆట పట్టించారా అని వ్యాఖ్యానించారు.
మరిన్ని ఇక్కడ చూడడండి: Dawood Ibrahim’s Brother Arrested : డ్రగ్స్ కేసులో దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కష్కర్ అరెస్ట్..
IND Vs NZ, WTC Final 2021 Day 6th Live: రిజర్వ్‌డేకు చేరిన ఫైనల్ మ్యాచ్.. పెవిలియన్‌కు పుజారా