ఆ అనకొండ వయస్సు 37 ఏళ్ళు… ప్రపంచ గిన్నెస్ రికార్డులకెక్కింది… ఇందుకు కారణం…?
ప్రపంచ గిన్నెస్ బుక్ రికార్డుల్లో ఇప్పటివరకు 'బందీగా' ....అంటే ఎవరైనా పెంచుకుంటున్నా..లేదా జూ ఎన్ క్లోజర్లలో ఉన్నా అలాంటి పాములకోసం ఓ కేటగిరీ అంటూ లేదు..

ప్రపంచ గిన్నెస్ బుక్ రికార్డుల్లో ఇప్పటివరకు ‘బందీగా’ ….అంటే ఎవరైనా పెంచుకుంటున్నా..లేదా జూ ఎన్ క్లోజర్లలో ఉన్నా అలాంటి పాములకోసం ఓ కేటగిరీ అంటూ లేదు.. పైగా ‘వయస్సు మీద పడిన’ పాములు లేదా అనకొండల విషయంలో అంతకన్నా లేదు. కానీ సౌతాఫ్రికా….జొహాన్నెస్ బర్గ్ లోని ‘ఆన్నీ’ అనే అనకొండ మాత్రం వరల్డ్ గిన్నెస్ బుక్ రికార్డుల్లో చోటు సంపాదించుకుంది. అరుదైన ‘గౌరవం’ దక్కించుకుంది. ఈ అనకొండ చరిత్ర కాస్త కుతూహలంగానే ఉంటుంది. ఒకప్పుడు పాల్ స్వైర్స్ అనే పెద్ద మనిషి దీన్ని అడవుల నుంచి ఇంటికి తెచ్చుకుని 1989 నుంచి 2004 వరకు ఎంతో ఇదిగా పెంచుకున్నాడట. 40 కేజీలకు పైగా బరువు, నాలుగు మీటర్ల పొడవు ఉన్న దీన్ని ‘ఆన్నీ’ అని సరదాగా పెంచుకుంటూ వచ్చాడట..అయితే ఏ కారణం వల్లో జొహాన్నెస్ బర్గ్ లోని మోంటే కేసినో బర్ద్ అండ్ రెప్టెల్ పార్క్ కి ఇచ్చి తాను న్యూజిలాండ్ వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఈ అనకొండ ఇక్కడే ఉంటోంది. దీని నిర్వాహకులే దీని ‘ఆలనా పాలనా’ చూస్తూ వచ్చారు.ఇటీవల పాల్ ఇక్కడికి వచ్చి దీన్ని చూసి ఆశ్చర్యపోయాడు. చాలా సంవత్సరాలు తాను దీన్ని పెంచానని.. తనను’ గుర్తు పడుతుందేమోనని’ ఆశించానని చమత్కరించాడు ..కానీ తన కోర్కె నెరవేరలేదన్నాడు.
ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన ఈయన.. తన 13 ఏళ్ళ వయస్సు నుంచి పాములు పట్టి సేకరించేవాడినని తెలిపాడు. వాటిలో ఎన్నో విష సర్పాలు కూడా ఉండేవన్నాడు. కానీ ముఖ్యంగా ఈ అనకొండను ప్రత్యేకంగా ఓ ఎన్ క్లోజర్ లో ఉంచి దానికోసం వేడి నీటి కొలనును కూడా ఏర్పాటు చేశానని చెప్పాడు. ఏమైనా ఇన్నేళ్ళుగా అనేకమంది ఆన్నీతో ‘సాన్నిహిత్యం’ ఏర్పరచుకోవడం విశేషమేనన్నాడు. ‘బందీగా ఉన్న వయస్సు పెద్దదైన సర్పాల కోసం ‘ గిన్నెస్ బుక్ వరల్డ్ రికార్డుల్లో సెపరేట్ కేటగిరీ ఏర్పాటు చేయాలనీ తాను కోరగానే ఆ బుక్ వారు అంగీకరించి దీని పేరును అందులో చేర్చారని పాల్ చెప్పాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ కి లండన్ కోర్టులో చుక్కెదురు… అయితే….?
NASA on Venus: శుక్రగ్రహం పై భూమి పొరల కదలికల వంటి కదలికలను గుర్తించిన నాసా పరిశోధనలు..