AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dawood Ibrahim’s Brother Arrested : డ్రగ్స్ కేసులో దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కష్కర్ అరెస్ట్..

Dawood Ibrahim's Brother Arrested : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడిని ముంబై ఎన్సీబీ అధికారులు

Dawood Ibrahim's Brother Arrested : డ్రగ్స్ కేసులో దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కష్కర్ అరెస్ట్..
Drug Case
Follow us
uppula Raju

|

Updated on: Jun 23, 2021 | 4:16 PM

Dawood Ibrahim’s Brother Arrested : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడిని ముంబై ఎన్సీబీ అధికారులు అరెస్టు చేశారు. మాదకద్రవ్యాల కేసులో ఇక్బాల్ కస్కర్‌ పట్టుబడ్డాడు. డ్రగ్స్ కేసులో ప్రొడక్షన్ వారెంట్‌పై ఇక్బాల్ కస్కర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఎన్‌సిబి చేసిన దాడుల్లో అధికారులు డ్రగ్స్‌కి సంబంధించిన రెండు కాష్ల చారాలను స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్ నుంచి కొంతమంది ఈ కాష్లను కాశ్మీర్ నుంచి ముంబైకి తీసుకువచ్చేవారు. బైక్ ద్వారా తరలించేవారు. సుమారు 25 కిలోల చరాస్ కాష్ స్వాధీనం చేసుకున్నారు.

ఇదిలా ఉంటే ఈ నెల ప్రారంభంలో దావూద్ ఇబ్రహీం సహచరుడు గ్యాంగ్ స్టర్ పర్వేజ్ ఖాన్ అలియాస్ చింకు పఠాన్‌తో సంబంధాలున్నాయని డ్రగ్స్ పెడ్లర్ హరిస్ ఖాన్‌ను ఎన్‌సిబి అరెస్టు చేసింది. గత ఏడాది బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి సంబంధించిన డ్రగ్స్ కేసులో ఖాన్ పాత్రపై దర్యాప్తు చేస్తామని కేంద్ర సంస్థ తెలిపింది. సబర్బన్ అంధేరి, లోఖండ్‌వాలా, బాంద్రాలోని వివిధ ప్రదేశాలలో ఎన్‌సిబి బృందం దాడి చేసిన తరువాత ఖాన్‌ను అరెస్టు చేశారు. చింకు పఠాన్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఖాన్‌ను అరెస్టు చేసినట్లు ఒక అధికారి పిటిఐకి చెప్పారు. అయితే రాజ్‌పుత్ మరణానికి సంబంధించిన డ్రగ్స్ కేసులో ఇతని పాత్రపై కూడా దర్యాప్తు చేయబడుతుంది.

IND Vs NZ, WTC Final 2021 Day 6th Live: రిజర్వ్‌డేకు చేరిన ఫైనల్‌ మ్యాచ్‌.. పెవిలియన్‌కు పుజారా

Shaminda Eranga : టెస్ట్, వన్డే, టీ 20 ఫార్మాట్లలో మొదటి ఓవర్‌లోనే వికెట్ సాధించిన ఏకైక బౌలర్..!

Sachin and Yuvraj Singh : సచిన్, యువరాజ్ సింగ్‌ల కొత్త ఆట..! వీరికి మరో పార్ట్‌నర్ జత కలిసాడు.. ఇంతకి ఏం చేశారో తెలుసా..?

AP-TS Water Dispute: తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ రాజుకున్న కృష్ణా నదీ జలవివాదం.. నేతల మధ్య పేలుతున్న మాటల తూటాలు