జీవితానికి DRS ఉండదు జాగ్రత్త.. వాహనదారులకు పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరిక!
ఐపీఎల్ క్రేజ్ దేశాన్ని ఊపేస్తున్న తరుణంలో, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. క్రికెట్ లైవ్ షోను మొబైల్ ఫోన్‌లో చూస్తూ వెళ్లే వాహనదారులకు ఇచ్చిన హెచ్చరిక ఆలోచింపజేసేలా ఉంది. ఇదే ఇప్పుడు ఇంటర్నెట్‌లో చర్చనీయాంశంగా మారింది.

ఐపీఎల్ క్రేజ్ దేశాన్ని ఊపేస్తున్న తరుణంలో, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. క్రికెట్ లైవ్ షోను మొబైల్ ఫోన్‌లో చూస్తూ వెళ్లే వాహనదారులకు ఇచ్చిన హెచ్చరిక ఆలోచింపజేసేలా ఉంది. ఇదే ఇప్పుడు ఇంటర్నెట్‌లో చర్చనీయాంశంగా మారింది.
క్రికెట్ మైదానంలో అంపైర్ నిర్ణయం తప్పు అనిపిస్తే, బ్యాటర్ వెంటనే DRS కోరవచ్చు. అక్కడ వికెట్ పడితే కేవలం ఆ ఇన్నింగ్స్ మాత్రమే ముగుస్తుంది. ఆటగాడు తర్వాతి మ్యాచ్‌లో మళ్ళీ ఆడొచ్చు. కానీ, రోడ్డు మీద DRS ఉండదు” అని సజ్జనార్ స్పష్టం చేశారు. రోడ్డుపై జరిగే ప్రమాదాల్లో పొరపాట్లను సరిదిద్దుకోవడానికి రెండో అవకాశం ఉండదని, అక్కడ జరిగే ప్రమాదం నేరుగా ప్రాణాలకే ముగింపు పలుకుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటూ సోషల్ మీడియా వేదికగా సజ్జనార్ పోస్ట్ చేశారు. బైక్ నడుపుతూ మొబైల్‌లో మ్యాచ్ చూస్తున్న ఒక వ్యక్తి వీడియోను షేర్ చేస్తూ, ఇటువంటి పనులు ఎంత ప్రమాదకరమో ఆయన వివరించారు.
డ్రైవింగ్‌లో మొబైల్ వాడటం (మ్యాచ్‌లు చూడటం, కాల్స్, మెసేజ్‌లు). కేవలం కొన్ని క్షణాల ఏకాగ్రత లోపించడంతో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించి జరిమానాలకు గురికాక తప్పదు. రెప్పపాటులో జరిగి ప్రమాదాలను నుంచి ఎవరు తప్పించుకోరని ఆయన హెచ్చరించారు.
“మీకు మ్యాచ్ ఎంత ముఖ్యమో, మీ కుటుంబానికి మీరు అంతకంటే ముఖ్యం” అన్న సజ్జనార్ మాటలు ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్నాయి. మీరు సురక్షితంగా ఇంటికి చేరడమే మీ కుటుంబ సభ్యులకు అతిపెద్ద విజయమని ఆయన పేర్కొన్నారు. క్రికెట్ పట్ల అభిమానం ఉండాలి కానీ, అది ప్రాణాలను పణంగా పెట్టే స్థాయికి వెళ్లకూడదని హితవు పలికారు. “బీ సేఫ్.. డ్రైవ్ సేఫ్” అంటూ బాధ్యతాయుతమైన ప్రయాణాన్ని కోరుతూ ఈ సందేశాన్ని ముగించారు.
మీరు చూసే IPLలో Decision Review System(DRS) ఉంటుంది… కానీ యమధర్మరాజు దగ్గర 'Death Review System' మాత్రం అస్సలు ఉండదు!
గ్రౌండ్లో వికెట్ పడితే ప్లేయర్ పెవిలియన్‌కి వెళ్తాడు.. కానీ రోడ్డు మీద ఇలా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ మీ వికెట్ పారేసుకుంటే, మీరు పర్మనెంట్‌గా పైకి… pic.twitter.com/RFk4UpX81Q
— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) April 24, 2026
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
