Mexico Road Accident: మెక్సికోలో ఘోర ప్రమాదం.. టోల్ బూత్ వద్ద ట్రక్కు బీభత్సం..15మంది సజీవదహనం
మెక్సికోలో ఘోర ప్రమాదం జరిగింది. హైవేపై టోల్ బూత్ వద్ద వేగంగా వచ్చిన ఓ ట్రక్కు బీభత్సం సృష్టించింది.
Mexico Road Accident: మెక్సికోలో ఘోర ప్రమాదం జరిగింది. హైవేపై టోల్ బూత్ వద్ద వేగంగా వచ్చిన ఓ ట్రక్కు బీభత్సం సృష్టించింది. టోల్ బూత్ వద్ద ఆగి ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 15మంది సజీవదహనమయ్యారు. ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. మెక్సికో చాల్కో మున్సిపాలిటీలో గ్లూ ట్రాన్స్‌పోర్ట్ చేస్తున్న ట్రక్కు బ్రేకులు ఫెయిలవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలిపారు అధికారులు.
శనివారం సెంట్రల్ మెక్సికోలోని హైవేపై ఉన్న టోల్ బూత్ వద్ద రవాణా ట్రక్కు కనీసం తొమ్మిది వాహనాలను ధ్వంసం చేసింది. కనీసం 15 మంది మరణించారు. మరో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. మెక్సికో రాష్ట్రంలోని చాల్కో మున్సిపాలిటీలో జరిగిన ప్రమాదంలో జిగురు రవాణా చేస్తున్న ట్రక్కు బ్రేకులు విఫలమైనట్లు అగ్నిమాపక శాఖ డిప్యూటీ డైరెక్టర్ అడ్రియన్ డియాజ్ చావెజ్ స్థానిక మీడియాకు తెలిపారు.
సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలు ప్రమాదానికి గురైన కొన్ని వాహనాలు మంటల్లో చిక్కుకున్నట్లు చూపించగా, టోల్ బూత్ సమీపంలో మరికొన్ని పూర్తిగా ధ్వంసమయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ వారిని హుటాహుటీన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని డియాజ్ వెల్లడించారు.