MERS Coronavirus: సౌదీ అరేబియాలో కొత్త వైరస్ వ్యాప్తి.. ఒకరు మృతి.. ఒంటెల ద్వారా వ్యాప్తి

|

May 11, 2024 | 11:35 AM

డబ్ల్యూహెచ్‌ఓ విడుదల చేసిన బులెటిన్‌లో.. మొత్తం 3 కేసులు రాజధాని రియాద్‌కు చెందినవని పేర్కొంది. బాధితుల్లో మహిళలు ఒకరు. మిడిల్-ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ తో బాధపడుతున్న వ్యక్తుల వయస్సు 56 నుండి 60 సంవత్సరాల మధ్య ఉంది. అంతేకాదు ఈ బాధితులందరూ అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్నట్లు చెప్పారు. ఈ నివేదిక ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిపై మరోసారి ఆందోళనను పెంచింది.

MERS Coronavirus: సౌదీ అరేబియాలో కొత్త వైరస్ వ్యాప్తి.. ఒకరు మృతి.. ఒంటెల ద్వారా వ్యాప్తి
Mers Coronavirus
Follow us on

ఏ సమయంలో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిందో అప్పటి నుంచి ప్రపంచాన్ని రకరకాల వైరస్ లు వణికిస్తూనే ఉన్నాయి. కోవిడ్ వేరియంట్ వివిధ రూపాలను సంతరించుకుంటూ నేటికీ ఎక్కడోచోట వెలుగులోకి వస్తూనే ఉంది. తాజాగా కరోనా వైరస్ కొత్త రూపం సౌదీ అరేబియాలో వెలుగులోకి వచ్చింది. ఈ విషయం గురించి సౌదీ అరేబియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)కి తెలియజేసింది. ఏప్రిల్ 10 నుంచి 17 మధ్య, దేశంలో ప్రమాదకరమైన మిడిల్-ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (MERS) వేగంగా వ్యాప్తి చెందుతోందని.. ఇప్పటికే కరోనావైరస్ కొత్త వేరియంట్ మూడు కేసులు కనుగొనబడ్డాయని పేర్కొంది. బాధితుల్లో ఒకరు మరణించాడు.

డబ్ల్యూహెచ్‌ఓ విడుదల చేసిన బులెటిన్‌లో.. మొత్తం 3 కేసులు రాజధాని రియాద్‌కు చెందినవని పేర్కొంది. బాధితుల్లో మహిళలు ఒకరు. మిడిల్-ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ తో బాధపడుతున్న వ్యక్తుల వయస్సు 56 నుండి 60 సంవత్సరాల మధ్య ఉంది. అంతేకాదు ఈ బాధితులందరూ అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్నట్లు చెప్పారు. ఈ నివేదిక ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిపై మరోసారి ఆందోళనను పెంచింది.

మిడిల్-ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ వ్యాప్తిపై పరిశోధన

ఈ మూడు కేసులూ రియాద్‌లోని ఆరోగ్య సంరక్షణ సదుపాయంతో ముడిపడి ఉన్నాయని.. ఈ వైరస్ వ్యాప్తిపై దర్యాప్తు జరుగుతోందని WHO బులెటిన్‌లో పేర్కొంది. సౌదీ అరేబియాలో ఏడాది ప్రారంభంలో మొత్తం 5 మెర్స్ కరోనా కేసులు నమోదయ్యాయని WHO తెలిపింది. వీరిలో 2 మంది చనిపోయారు.

ఇవి కూడా చదవండి

మెర్స్ వైరల్ అంటే ఏమిటి?

మెర్స్ ఒక వైరల్ ఇన్ఫెక్షన్. మెర్స్ బాధితుల్లో 36 శాతం మంది చనిపోయారు. అయితే మిడిల్-ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య వాస్తవంగా ఎక్కువగా ఉందని పేర్కొన్నారు, ఎందుకంటే MERS-CoV లక్షణాలు తేలికపాటివి అయినప్పటికీ.. గుర్తించడం కష్టం. అయితే వైరస్ మరణాల సంఖ్య ఆసుపత్రి, ప్రయోగశాల డేటాపై ఆధారపడి ఉంటుంది. ఈ వైరస్‌కు ఇంకా సరైన వ్యాక్సిన్ లేదా చికిత్స లేదు. అయినప్పటికి అనేక MERS-CoV నిర్దిష్ట టీకాలు, చికిత్సలు అభివృద్ధి చేయబడుతున్నాయి.

ఇన్ఫెక్షన్ ఒంటెల ద్వారా వ్యాప్తి

డ్రోమెడరీ ఒంటెలతో ప్రత్యక్ష లేదా పరోక్ష స్పర్శ ఉన్న ప్రజలకు MERS-CoVని సంక్రమిస్తుంది. ఒంటెలు ఈ వైరస్ వ్యాప్తికి సహజ మూలం. MERS-CoV ఒక వ్యక్తి నుండి మరొకరికి వ్యాపించే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..