విటమిన్ బి ఒత్తిడి, ఆందోళనను నియంత్రించడంలో సహాయపడుతుంది. అందువల్ల మంచి మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి శరీరంలో విటమిన్ బి తగినంత స్థాయిలో ఉండటం చాలా అవసరం. విటమిన్ బి లోపాన్ని పాలు, పాల ఉత్పత్తులు, సోయాబీన్స్, గుడ్లు, ఆకుపచ్చ కూరగాయలు, పండ్లను ఆహారంలో చేర్చడం ద్వారా భర్తీ చేయవచ్చు. అధిక కెఫిన్, గ్లూటెన్ కూడా ఒత్తిడి స్థాయిలను పెంచుతాయి. కాబట్టి కాఫీ, టీలు వీలైనంత తక్కువగా తీసుకోవాలి. అలాగే రోజూ ఉదయం వాకింగ్, తేలికపాటి వ్యాయామం చేయాలి. పెయింటింగ్, సంగీతం వినడం వంటివి మీకు నచ్చిన పని చేస్తే మనసు బాగుంటుంది.