AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mothers Day 2024: కోడలు అత్తకు కూతురైతే.. కోడలికి అత్త అమ్మే.. మథర్స్ డే రోజున ఇలా జరుపుకోండి…

ప్రతి స్త్రీ జీవితంలో మదర్స్ డే ముఖ్యమైనది. ఈ రోజున పిల్లలు తమ తల్లిని సంతోషపెట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. వంటలను సిద్ధం చేయడం, ఇంటిని అలంకరించడం సహా తన తల్లికి ఇష్టమైన వస్తువులను బహుమతిగా ఇవ్వడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. అయితే పెళ్లయిన తర్వాత ఆ అమ్మాయికి తల్లి ప్లేస్ లో అత్తగారు వస్తారు. అటువంటి పరిస్థితిలో మదర్స్ డే సందర్భంగా మీ అత్తగారు ప్రత్యేకంగా భావించేలా చేయడానికి కొన్ని చిట్కాల సహాయం తీసుకోవచ్చు.

Mothers Day 2024: కోడలు అత్తకు కూతురైతే.. కోడలికి అత్త అమ్మే.. మథర్స్ డే రోజున ఇలా జరుపుకోండి...
Mother's Day
Surya Kala
|

Updated on: May 11, 2024 | 9:39 AM

Share

మదర్స్ డే ప్రతి కూతురికి చాలా ప్రత్యేకమైన రోజు. వాస్తవానికి పిల్లలు తమ తల్లికి ప్రత్యేక అనుభూతిని కలిగించడానికి ఎటువంటి సందర్భం వచ్చినా వదిలిపెట్టరు. మరి అలాంటిది కూతురు తన తల్లిపై ప్రేమని తెలిపే సందర్భం వస్తే ఎంతగా ఆనందిస్తుందో చెప్పలేం. అటువంటి కూతురు పెళ్లయిన తర్వాత అమ్మానాన్నలను వదిలి అత్తమామల ఇంటికి వెళ్తుంది. ఈ సందర్భంగా తల్లిని చాలా మిస్సవుతుంది. అదే సమయంలో తన అత్తగారిని ఎలా చూసుకోవాలి? అని ఆలోచిస్తుంటే.. మథర్స్ డే వేదికగా మారుతుంది.

ప్రతి స్త్రీ జీవితంలో మదర్స్ డే ముఖ్యమైనది. ఈ రోజున పిల్లలు తమ తల్లిని సంతోషపెట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. వంటలను సిద్ధం చేయడం, ఇంటిని అలంకరించడం సహా తన తల్లికి ఇష్టమైన వస్తువులను బహుమతిగా ఇవ్వడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. అయితే పెళ్లయిన తర్వాత ఆ అమ్మాయికి తల్లి ప్లేస్ లో అత్తగారు వస్తారు. అటువంటి పరిస్థితిలో మదర్స్ డే సందర్భంగా మీ అత్తగారు ప్రత్యేకంగా భావించేలా చేయడానికి కొన్ని చిట్కాల సహాయం తీసుకోవచ్చు.

అత్తగారికి ఇష్టమైన ఆహారాన్ని సిద్ధం చేయండి.

మీరు ఎవరినైనా సంతోషపెట్టాలనుకుంటే లేదా వారి హృదయంలో చోటు సంపాదించుకోవాలనుకుంటే వారికి నచ్చిన ఆహారాన్ని వండడమే ఉత్తమ మార్గం. కమ్మని చేతి వంటతో చాలా వరకూ ఎదుటి వ్యక్తులు ప్రభావితం కావచ్చు. మదర్స్ డేని ప్రత్యేకంగా జరుపుకోవలనుకుంటే ఈ రోజున మీ అత్తగారికి నచ్చిన అన్ని ఆహారాన్ని సిద్ధం చేయండి. నచ్చిన వంటని తయారు చేసి వారిని ఆశ్చర్యపరచవచ్చు. తన ఇష్టాలను గుర్తించిన కోడలు కూడా తన కూతురే అని అత్తగారు అనుకుంటారు. మాతృదినోత్సవాన్ని జరుపుకుంటున్నందుకు సంతోషపడతారు.

ఇవి కూడా చదవండి

అత్తగారి కోసం సర్ ప్రైజ్ పార్టీ ఏర్పాటు చేయండి..

మదర్స్ డే రోజున అత్తగారికి కోడలు సర్ ప్రైజ్ పార్టీని ఏర్పాటు చేయవచ్చు. ఈ కార్యక్రమంలో భాగంగా అత్తగారికి ప్రత్యేకమైన స్నేహితులను పిలిచి సంతోషపెట్టవచ్చు. పార్టీని నిర్వహిస్తూ కుటుంబం మొత్తం కలిసి మదర్స్ డే జరుపుకోవచ్చు. మీ పుట్టిల్లు కూడా మీ ఇంటికి సమీపంలో ఉన్నట్లయితే మీ కుటుంబ సభ్యులను కూడా ఈ పార్టీకి ఆహ్వానించవచ్చు. అటువంటి పరిస్థితిలో మీ తల్లులిద్దరితో అంటే అత్తగారు, అమ్మతో కలిసి మదర్స్ డే జరుపుకోవచ్చు.

అత్తగారి కోసం బ్యూటీ సెషన్‌ను బుక్ చేయండి..

ఏ వయస్సులో ఉన్నా సరే మహిళలు అందంగా కనిపించడానికి ఇష్టపడతారు. అటువంటి పరిస్థితిలో అత్తగారి కోసం బ్యూటీ సెషన్‌ను బుక్ చేయవచ్చు. ఇది వారి మానసిక స్థితిని రిలాక్స్ చేస్తుంది. మంచి అనుభూతి చెందుతారు.

ప్రత్యేక బహుమతిని సిద్ధం చేయండి..

మదర్స్ డే రోజు మీ అత్తగారికి ప్రత్యేక అనుభూతిని కలిగించడానికి ఆమెతో మీ సంబంధాన్ని మరింత దృఢంగా మార్చుకోవడానికి మీకు నచ్చినదాన్ని బహుమతిగా ఇవ్వవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..