AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

న్యూయార్క్‌లో దారుణ ఘటన.. బెల్టుతో గొంతు బిగించి అపస్మారక స్థితిలో ఉన్న మహిళపై అత్యాచారం..నిందితుడి ఫోటో రిలీజ్

ఈ ఘటనకు పాల్పడినప్పుడు నిందితుడు నోరుని, తన ముఖాన్ని తెల్లటి గుడ్డతో కప్పుకున్నాడు. నిందితుడు ముందుగా మహిళపై మెరుపుదాడి చేసి ఆపై దారుణంగా హింసించాడు. ముందుగా బాధితురాలి మెడకు బెల్టుని బిగించాడు. ఈ సమయంలో మహిళ తనను తాను రక్షించుకోవడానికి నిందితుడిపై దాడి చేస్తూ తనని తాను రక్షించుకోవడానికి ప్రయత్నించింది. అయితే బెల్ట్ బాగా బిగించి ఉండడంతో ఆ మహిళ స్పృహతప్పి పడిపోయింది.

న్యూయార్క్‌లో దారుణ ఘటన.. బెల్టుతో గొంతు బిగించి అపస్మారక స్థితిలో ఉన్న మహిళపై అత్యాచారం..నిందితుడి ఫోటో రిలీజ్
Crime News In New York City
Surya Kala
|

Updated on: May 11, 2024 | 9:10 AM

Share

అమెరికాలోని న్యూయార్క్ నగరంలో హృదయాన్ని కదిలించే వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో ఓ వ్యక్తి ఓ మహిళను దారుణంగా కొట్టాడు. అంతేకాదు ఆ వ్యక్తి మహిళను ఈడ్చుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు అంతటితో ఆగకుండా ఆ మహిళ మెడకు బెల్టు వేసి బలవంతంగా కింద పడేలా చేశాడు. ఈ ఘటన మొత్తం సమీపంలో అమర్చిన సీసీటీవీలో రికార్డయింది.

స్థానిక మీడియా నివేదికల ప్రకారం ఈ సంఘటన మే 1 న జరిగింది. నిందితుడి కోసం పోలీసులు వెతుకుతున్నారు. అయితే నిందితుడిని ఇంకా గుర్తించలేదు. న్యూయార్క్ నగరంలోని బ్రోంక్స్‌లో మహిళ నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. నిందితుడు మహిళపై వెనుక నుంచి దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. దాడి అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యారు.

ఇవి కూడా చదవండి

ఈ ఘటనకు పాల్పడినప్పుడు నిందితుడు నోరుని, తన ముఖాన్ని తెల్లటి గుడ్డతో కప్పుకున్నాడు. నిందితుడు ముందుగా మహిళపై మెరుపుదాడి చేసి ఆపై దారుణంగా హింసించాడు. ముందుగా బాధితురాలి మెడకు బెల్టుని బిగించాడు. ఈ సమయంలో మహిళ తనను తాను రక్షించుకోవడానికి నిందితుడిపై దాడి చేస్తూ తనని తాను రక్షించుకోవడానికి ప్రయత్నించింది. అయితే బెల్ట్ బాగా బిగించి ఉండడంతో ఆ మహిళ స్పృహతప్పి పడిపోయింది.

నిందితుడి కోసం అన్వేషణలో పోలీసులు

నిందితుడు మహిళను రెండు కార్ల మధ్యకు లాగాడు. అక్కడ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. మీడియా కథనాల ప్రకారం, దాడికి ముందు నిందితుడు మహిళతో మాట్లాడాడు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడి ప్రొఫైల్‌ను విడుదల చేశారు. నిందితుడి ఎత్తు 5 అడుగుల 9 అంగుళాలు అని న్యూయార్క్ పోలీసులు తెలిపారు. దాడి చేసిన సమయంలో అతను నలుపు రంగు చొక్కా, తెలుపు రంగు ప్యాంటు ధరించాడు. ప్రస్తుతం న్యూయార్క్ పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..