AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొన్ని వందల వేలఏళ్లుగా తుప్పు పట్టని పరశురాముడి గండ్రగొడ్డలి.. తంగినాథ్ ధామ్ ఎక్కడ ఉందంటే

పురాణాల విశ్వాసాల ప్రకారం పరశురాముని గొడ్డలి ఇప్పటికీ భూమిపై, గొడ్డలిని భూమిలో పాతిపెట్టిన ప్రదేశంలో ఉంది. ఆ ప్రదేశం తంగినాథ్ ధామ్. త్రిశూలం ఆకారంలో ఉన్న భారీ గొడ్డలిని పరశురాముడు భూమిలో పాతిపెట్టిట్లు కథనం. ఈ ప్రదేశం జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలోని డుమ్రీ బ్లాక్‌లో ఉంది.  జార్ఖండ్ స్థానిక గిరిజన భాషలో, గొడ్డలిని టాంగి అంటారు. అందుకే ఈ ప్రాంతానికి తంగినాథ్ ధామ్ అని పేరు వచ్చింది. ఇది గుమ్లా జిల్లాలోని దట్టమైన అడవిలో ఉంది.

కొన్ని వందల వేలఏళ్లుగా తుప్పు పట్టని పరశురాముడి గండ్రగొడ్డలి.. తంగినాథ్ ధామ్ ఎక్కడ ఉందంటే
Baba Tanginath Dham Temple
Surya Kala
|

Updated on: May 11, 2024 | 8:47 AM

Share

రామాయణం, మహాభారతం, భాగవత పురాణం మొదలైన గ్రంథాల్లో విష్ణుమూర్తి అవతారమైన పరశురాముడి కోపం, ఉగ్ర రూపం, అతని భారీ గొడ్డలి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించబడింది. రాముడి వలనే పరశురాముడు కూడా విష్ణువు అవతారం. శివుడి అనుగ్రహం పొడిన పరశురాముడు జమదగ్ని, రేణుకల సంతానం. మిథిల మహారాజు జనకుని కుమార్తె సీత దేవి స్వయంవర సమయంలో విధించిన షరతు ప్రకారం.. శివుడి ధనస్సుని ఎక్కుపెట్టమని చెప్పినప్పుడు.. శ్రీ రాముడు తీగను విరిచాడు. ఈ విషయం శివుడికి గొప్ప భక్తుడైన పరశురాముడు, కోపంతో రాముడిని శిక్షించడానికి సీతా స్వయంవర వేదిక వద్దకు చేరుకుంటాడు. అయితే తన ముందు నిలబడి ఉన్న శ్రీరాముడు కూడా విష్ణువు అవతారమేనని పరశురాముడు తెలుసుకున్నప్పుడు.. తన గర్వానికి కోపానికి సిగ్గుపడతాడు. దీని తరువాత అతను తన పరశువును (భారీ గొడ్డలిని) లుచుట్పట్ అడవిలోని ఒక పర్వతంపై భూమిలో పాతిపెట్టాడు. శివయ్య ను ధ్యానిస్తూ ఆ పరశువుకు పూజలు చేసినట్లు పురాణాల కథనం.

ఈ ప్రదేశం తంగినాథ్ ధామ్‌కు ప్రసిద్ధి

పురాణాల విశ్వాసాల ప్రకారం పరశురాముని గొడ్డలి ఇప్పటికీ భూమిపై, గొడ్డలిని భూమిలో పాతిపెట్టిన ప్రదేశంలో ఉంది. ఆ ప్రదేశం తంగినాథ్ ధామ్. త్రిశూలం ఆకారంలో ఉన్న భారీ గొడ్డలిని పరశురాముడు భూమిలో పాతిపెట్టిట్లు కథనం. ఈ ప్రదేశం జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలోని డుమ్రీ బ్లాక్‌లో ఉంది.

108 శివలింగంతో కూడిన దేవతామూర్తుల విగ్రహాలు

జార్ఖండ్ స్థానిక గిరిజన భాషలో, గొడ్డలిని టాంగి అంటారు. అందుకే ఈ ప్రాంతానికి తంగినాథ్ ధామ్ అని పేరు వచ్చింది. ఇది గుమ్లా జిల్లాలోని దట్టమైన అడవిలో ఉంది. తంగినాథ్ ధామ్‌లో రాళ్లతో నిర్మించిన పురాతన ఆలయం. దీనితో పాటు శివయ్యకు చెందిన 108 శివలింగాలతో పాటు బహిరంగ ప్రదేశంలో ఆకాశం క్రింద ఇతర దేవుళ్ల పురాతన రాతి విగ్రహాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

పరశురామ్ తన తల్లి తలను ఖండించినప్పుడు

తంగినాథ్ ధామ్ కి పరశురాముడికి సంబంధించిన మరొక పురాణ కథనం ప్రకారం తన తండ్రి జమదగ్ని కోరిక మేరకు పరశురాముడు తన పరశువుతో తన తల్లి రేణుక తలను ఖండించి వేశాడు. అయితే తన తండ్రి జమదగ్ని నుండి పొందిన వరంతో తన తల్లి రేణుకను తిరిగి బ్రతికించాడు.

భూమిలో పాతిపెట్టిన గొడ్డలి

ఈ సంఘటన తర్వాత పరశురాముడి మాతృ హత్య చేసిన పాపం అంటుకుంది. తన తల్లిని చంపిన పాపం నుండి విముక్తి పొందడానికి పరశురాముడు తంగినాథ్ ధామ్‌లో భారీ త్రిశూలం ఆకారంలో ఉన్న గొడ్డలిని భూమిలో పాతిపెట్టి కఠినమైన తపస్సు చేసి శివుడిని ప్రసన్నం చేసుకున్నాడు. పరశురాముని తపస్సుకి మెచ్చి శివుడు తంగినాథ్ ధామ్‌లో ప్రత్యక్షమయ్యాడు. మాతృహత్య పాపం నుంచి పరశురాముడికి విముక్తిని ఇచ్చాడు.

పురాణ గ్రంధాల ప్రకారం త్రిశూల ఆకారపు గొడ్డలి (టాంగి) తంగినాథ్ ధామ్‌లో ఖననం చేయబడింది. అది భోలాశంకరుడు దివ్య త్రిశూలం. తన ప్రియమైన భక్తుడైన పరశురాముడికి సంతోషంగా బహుమతిగా ఇచ్చాడు.

1984లో తవ్వకాలు జరిగాయి

1984లో తంగినాథ్ ధామ్‌లో పాతిపెట్టిన త్రిశూల ఆకారపు గొడ్డలి (తంగి) రహస్యాన్ని తెలుసుకోవడానికి త్రవ్వకాలు జరిగాయి. 15 అడుగులకు పైగా మట్టిని తవ్వినా భూమిలో పాతిపెట్టిన గొడ్డలి చివరి భాగం కనిపించలేదు. భూమికి దాదాపు 5 అడుగుల ఎత్తులో త్రిశూల ఆకారపు గొడ్డలి ఉంది. వేలాది సంవత్సరాలుగా బహిరంగ ప్రదేశంలో ఉంది. చలి, వేడి, వర్షంలో తడుస్తూ ఉన్న ఈ త్రిశూలం ఆకారంలో ఉన్న ఇనుప గొడ్డలి (టాంగి) నేటికీ తుప్పు పట్టలేదు.

ఇతర రాష్ట్రాల ప్రజలు దర్శనానికి వస్తుంటారు

ఈ కారణాల వల్ల తంగినాథ్ ధామ్‌లో శివుడు భౌతికంగా ఉన్నాడని చెబుతారు. పవిత్రమైన శ్రావణ మాసంలో మహాదేవుని దర్శనం చేసుకోవడానికి జార్ఖండ్ నుంచి మాత్రమే కాకుండా బీహార్, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్, బెంగాల్, మధ్యప్రదేశ్ సహా దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు ప్రతిరోజూ ఇక్కడకు వస్తారు. ప్రత్యేకంగా శ్రావణ మాసం సమయంలో పూజలు చేస్తారు.

తంగినాథ్ ధామ్ జార్ఖండ్ రాజధాని రాంచీకి 150 కిలోమీటర్ల దూరంలో జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలోని డుమ్రీ బ్లాక్‌లోని లుచుట్‌పట్ కొండలపై ఉంది. తంగినాథ్ ధామ్ చేరుకోవడానికి గుమ్లా జిల్లా ప్రధాన కార్యాలయం నుంచి బస్సు, టెంపో లేదా ప్రైవేట్ వాహనాల సహాయంతో సులభంగా చేరుకోవచ్చు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు