AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లికి ఆలస్యం అవుతుందా.. కోరుకున్న భర్త కోసం గంగా సప్తమి రోజున చేయాల్సిన చర్యలు ఏమిటంటే

ప్రధానంగా గంగా సప్తమి రోజున గంగాదేవి మళ్లీ భూమిపైకి వచ్చిందని నమ్ముతారు. హిందూ మతంలో ఈ రోజుకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. జ్యోతిష్య శాస్త్రంలో గంగా సప్తమి రోజున తీసుకోవలసిన కొన్ని నియమ నిబంధనలు పేర్కొన్నాయి. ఈ పరిహారాలు చేయడం వల్ల ఏడు జన్మల పాపాలు తొలగిపోయి ఇంటికి ఐశ్వర్యం కలుగుతుందని చెబుతారు. గంగా సప్తమికి చేయాల్సిన పరిహారాల గురించి తెలుసుకుందాం.

పెళ్లికి ఆలస్యం అవుతుందా.. కోరుకున్న భర్త కోసం గంగా సప్తమి రోజున చేయాల్సిన చర్యలు ఏమిటంటే
Ganga Saptami
Surya Kala
|

Updated on: May 11, 2024 | 9:57 AM

Share

గంగా సప్తమి రోజు గంగాదేవికి అంకితం చేయబడింది. ఈ రోజున గంగాదేవిని పూజిస్తారు. గంగా సప్తమి రోజున గంగాదేవి పునర్జన్మ పొందిందని మత విశ్వాసం. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని శుక్ల పక్ష సప్తమి తిథి రోజుని గంగా సప్తమిగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో గంగా సప్తమి పండుగను 14 మే 2024 మంగళవారం జరుపుకోనున్నారు. పురాణాల ప్రకారం వైశాఖ శుక్ల పక్షంలోని సప్తమి తిథి రోజున జాహ్నవి మహర్షి తన చెవి నుంచి గంగను విడుదల చేశాడు. ఈ కథ ప్రకారం గంగా సప్తమని జహ్న సప్తమి అని కూడా అంటారు. అదే సమయంలో కొన్ని పురాణ కథల ప్రకారం గంగాదేవిని జహ్న మహర్షి కుమార్తె జాన్వి అని కూడా పిలుస్తారు.

ప్రధానంగా గంగా సప్తమి రోజున గంగాదేవి మళ్లీ భూమిపైకి వచ్చిందని నమ్ముతారు. హిందూ మతంలో ఈ రోజుకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. జ్యోతిష్య శాస్త్రంలో గంగా సప్తమి రోజున తీసుకోవలసిన కొన్ని నియమ నిబంధనలు పేర్కొన్నాయి. ఈ పరిహారాలు చేయడం వల్ల ఏడు జన్మల పాపాలు తొలగిపోయి ఇంటికి ఐశ్వర్యం కలుగుతుందని చెబుతారు. గంగా సప్తమికి చేయాల్సిన పరిహారాల గురించి తెలుసుకుందాం.

గంగా సప్తమి 2024 తేదీ

సప్తమి తిథి ప్రారంభమవుతుంది – 14 మే 2024 మధ్యాహ్నం 2:50 గంటలకు. సప్తమి తిథి ముగుస్తుంది- 15 మే 2024 ఉదయం 4:19 గంటలకు.

ఇవి కూడా చదవండి

గంగా సప్తమి నివారణలు

వివాహం కోసం పరిహారాలు- వివాహం ఎవరికైనా ఆలస్యం అయితే గంగా సప్తమి రోజున.. గంగాజలంలో 5 బిల్వ పత్రాలు వేసి.. ఆ నీటితో భోలేనాథుడికి జలాభిషేకాన్ని ఆచారాల ప్రకారం చేయండి. ఇలా చేయడం వల్ల శివ, గంగలు ఇద్దరూ సంతోషంగా ఉంటారు. దీవెనలు ఇస్తారని నమ్ముతారు. అలాగే వివాహానికి అడ్డంకులు తొలగిపోయి కోరుకున్న జీవిత భాగస్వామి దొరుకుతుంది.

విజయానికి చిట్కాలు- మీరు ఏదైనా పనిలో పదేపదే విఫలమవుతూ జీవితంలో విజయం సాధించాలనుకుంటే, గంగా సప్తమి రోజున గంగలో పాలు పోసి, గంగామాత మంత్రాలను పద్దతిగా జపించండి. అలాగే గంగా తీరంలో కర్పూర దీపం వెలిగించి హారతిని ఇవ్వండి. ఈ పరిహారాన్ని చేయడం వల్ల జీవితంలో విజయం సాధిస్తారని నమ్ముతారు.

మోక్షాన్ని పొందే మార్గాలు- గంగా సప్తమి రోజున స్నానం, తపస్సు, ధ్యానం చేయండి. గంగాస్నానం చేయలేక పోతే ఇంట్లో గంగాజలాన్ని నీటిలో కలుపుకుని స్నానం చేయండి. దీనితో పాటు మీ శక్తి ప్రకారం పేద ప్రజలకు బట్టలు, ఆహారాన్ని అందించండి. ఇది ముక్తికి దారితీస్తుందని నమ్ముతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు