Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maldives: భారతీయుల దెబ్బకు దిగొచ్చిన మాల్దీవులు ప్రభుత్వం.. ముగ్గురు మంత్రులపై సస్పెన్షన్ వేటు..

భారత ప్రధాని మోదీ తోపాటు, భారతీయులపై మాల్దీవులు మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చ నడుస్తోంది. బాయ్ కాట్ మాల్‎దీవ్స్ అంటూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్స్. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న భారతీయులు తమ టూర్‎లను రద్దు చేసుకుంటున్నారు. దీంతో స్పందించింది మాల్దీవులు ప్రభుత్వం. ఈ క్రమంలోనే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

Maldives: భారతీయుల దెబ్బకు దిగొచ్చిన మాల్దీవులు ప్రభుత్వం.. ముగ్గురు మంత్రులపై సస్పెన్షన్ వేటు..
Pm Modi
Follow us
Srikar T

|

Updated on: Jan 08, 2024 | 9:00 AM

భారత ప్రధాని మోదీ తోపాటు, భారతీయులపై మాల్దీవులు మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చ నడుస్తోంది. బాయ్ కాట్ మాల్‎దీవ్స్ అంటూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్స్. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న భారతీయులు తమ టూర్‎లను రద్దు చేసుకుంటున్నారు. దీంతో స్పందించింది మాల్దీవులు ప్రభుత్వం. ఈ క్రమంలోనే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని మాల్దీవుల అధికార ప్రతినిధి ఇబ్రహీం ఖలీల్ వెల్లడించారు. ఇందులో షియూనా, మాల్షా, హసన్ జిహాన్ అనే ముగ్గురు మంత్రులు ఉన్నట్లు తెలిపారు. ఇటీవల ప్రధాని మోదీ మాల్డీవుల్లో పర్యటించారు. అక్కడి బీచ్ లో ఫోటో షూట్ చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై మాల్దీవులు ఎంపీలు మోదీతో పాటు, భారతీయులపై తమ అక్కస్సును వెళ్లగక్కారు. భారత టూరిజం విధానంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.

మాల్దీవ్స్ మంత్రులు చేసిన వ్యాఖ్యలను పలువురు సినీ, క్రీడా ప్రముఖులు కూడా స్పందించారు. ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ట్విట్టర్ వేదికగా నరేంద్ర మోదీని తోలుబొమ్మగా అభివర్ణించారు మరియం షియునా. అలాగే ఎంపీ షరీఫ్ స్పందిస్తూ బీచ్ టూరిజంలో మాల్దీవులతో భారత్ పోటీ పడటం అనేది పెద్ద సవాలుగా అభివర్ణించారు. దీంతో తీవ్ర దుమారం రేగింది. గతంలో కూడా మోదీ లక్షద్వీప్ ను పర్యటించినప్పుడు సాహసాలు చేయాలనుకునే వారు ఈ ప్రాంతాన్ని సందర్శించవచ్చు అని తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు. తద్వారా లక్షద్వీప్ టూరిజం విపరీతంగా పెరిగింది. అయితే మాల్దీవుల్లో పర్యటించిన మోదీ తన వీడియోలు పోస్ట్ చేయడంతో అక్కడి మంత్రులు ఇలా స్పందించడం తీవ్ర దుమారం రేపుతోంది. సామాజిక మాధ్యమాల ప్రభావం ఆ దేశంలోని ముగ్గురు మంత్రులపై తీవ్ర ప్రభావం చూపిందని చెప్పవచ్చు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోరు తెరిచి నిద్రపోయేవారిలో ఈ రిస్క్.. మీకూ ఈ అలవాటుందా?
నోరు తెరిచి నిద్రపోయేవారిలో ఈ రిస్క్.. మీకూ ఈ అలవాటుందా?
ఎముకలను ఉక్కులా మార్చే సూప్.. ఇలా చేయండి
ఎముకలను ఉక్కులా మార్చే సూప్.. ఇలా చేయండి
గోనెసంచితో అస్పత్రికొచ్చిన యువకుడు.. లోపల ఏముందని చూడగా..
గోనెసంచితో అస్పత్రికొచ్చిన యువకుడు.. లోపల ఏముందని చూడగా..
వాషింగ్ మెషీన్‌ను ఇంట్లో ఇక్కడుంచితే పనుల్లో విజయం సాధిస్తారు
వాషింగ్ మెషీన్‌ను ఇంట్లో ఇక్కడుంచితే పనుల్లో విజయం సాధిస్తారు
440కి 434 మార్కులొచ్చాయనీ..ఈ అమ్మాయి ఎలా ఏడుస్తుందో చూడండి! Video
440కి 434 మార్కులొచ్చాయనీ..ఈ అమ్మాయి ఎలా ఏడుస్తుందో చూడండి! Video
కాసిన్ని నీళ్లు కావాలంటూ ఇంట్లోకి దూరారు.. ఆమె లోపలికి వెళ్లగానే.
కాసిన్ని నీళ్లు కావాలంటూ ఇంట్లోకి దూరారు.. ఆమె లోపలికి వెళ్లగానే.
PSLలో IPL.. అవార్డుల వేడుకలో పాక్ దిగ్గజం బ్లండర్ మిస్టేక్
PSLలో IPL.. అవార్డుల వేడుకలో పాక్ దిగ్గజం బ్లండర్ మిస్టేక్
కర్కాటక రాశిలో కుజ సంచారం ఎవరికీ మంచిది? ఎవరి కష్టాలు తెస్తాయంటే
కర్కాటక రాశిలో కుజ సంచారం ఎవరికీ మంచిది? ఎవరి కష్టాలు తెస్తాయంటే
వాష్ బేసిన్‌లో ఈ హ్యాక్ గురించి మీకు తెలుసా?
వాష్ బేసిన్‌లో ఈ హ్యాక్ గురించి మీకు తెలుసా?
ఆ ప్రాంతాలకు రెయిన్ అలెర్ట్.. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు..
ఆ ప్రాంతాలకు రెయిన్ అలెర్ట్.. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..