USA Entry: అమెరికాలో అక్రమ ఎంట్రీకి రూ. లక్షల్లో చెల్లింపు.! ఎంట్రీకి ఆ గుజరాతీల ప్లాన్.!

అమెరికాలో అక్రమంగా ప్రవేశించడానికి సహకరిస్తే రూ.60 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు ముట్టజెప్పడానికి కొందరు గుజరాతీలు సిద్ధమైన వైనం బయటపడింది. 303 మంది ప్రయాణికులతో నికరాగువా వెళుతున్న ఓ అద్దె విమానాన్ని వారం రోజుల క్రితం ఫ్రాన్స్‌లో నిలిపివేశారు. వారిలో 260 మంది భారతీయులు కాగా, అందులోనూ 66 మంది గుజరాత్‌కు చెందినవారు. ఫ్రాన్స్‌లో నాలుగు రోజులు చిక్కుకుపోయిన వారి విమానం డిసెంబరు 26న ముంబయికి తిరిగొచ్చింది.

USA Entry: అమెరికాలో అక్రమ ఎంట్రీకి రూ. లక్షల్లో చెల్లింపు.! ఎంట్రీకి ఆ గుజరాతీల ప్లాన్.!

|

Updated on: Jan 08, 2024 | 11:16 AM

అమెరికాలో అక్రమంగా ప్రవేశించడానికి సహకరిస్తే రూ.60 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు ముట్టజెప్పడానికి కొందరు గుజరాతీలు సిద్ధమైన వైనం బయటపడింది. 303 మంది ప్రయాణికులతో నికరాగువా వెళుతున్న ఓ అద్దె విమానాన్ని వారం రోజుల క్రితం ఫ్రాన్స్‌లో నిలిపివేశారు. వారిలో 260 మంది భారతీయులు కాగా, అందులోనూ 66 మంది గుజరాత్‌కు చెందినవారు. ఫ్రాన్స్‌లో నాలుగు రోజులు చిక్కుకుపోయిన వారి విమానం డిసెంబరు 26న ముంబయికి తిరిగొచ్చింది. అందులోని 66 మంది గుజరాతీలలో 55 మంది తమను దుబాయ్‌, నికరాగువాల మీదుగా అమెరికాలో అక్రమంగా ప్రవేశపెడితే రూ.60-80 లక్షల వరకు చెల్లిస్తామని 15 మంది స్థానిక ఏజెంట్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు గుజరాత్‌ సీఐడీ ఎస్పీ సంజయ్‌ ఖారట్‌ తెలిపారు. ఈ గుజరాతీలలో ఎక్కువమంది 8 నుంచి 12వ తరగతి వరకు మాత్రమే చదివారు. వీరు అమెరికాకు చేరుకున్నాకే ఏజెంట్లకు డబ్బు చెల్లించేట్లు ఒప్పందం కుదిరింది. 2023లో నికరాగువా గుండా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించడానికి 96,917 మంది భారతీయులు ప్రయత్నించారని అమెరికా అధికారులు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.

Follow us