Liz Truss Resigns: బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా.. మరోసారి రాజకీయ సంక్షోభం..
బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ పదవి మూణాళ్ల ముచ్చటగా మిగిలింది. సొంత పార్టీ నాయకుల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా చేశారు
బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా చేశారు. తదుపరి ప్రధానిని ఎన్నుకునే వరకు ఆమె ఆ పదవిలో కొనసాగుతారు. ట్రస్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొన్ని వారాల తర్వాత, ఆర్థిక వ్యవస్థ యొక్క తప్పు నిర్వహణ కారణంగా పార్టీలో తిరుగుబాటు జరిగింది. గత వారం రోజుల్లో ఇద్దరు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. వెస్ట్‌మిన్‌స్టర్‌లోని రాజకీయ గందరగోళాల మధ్య, కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు లిజ్ ట్రస్‌ను నాయకుడిగా ఎన్నుకోవాలనే వారి సెప్టెంబర్ నిర్ణయం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు.
రాజీనామాకు కారణం ఇదే..
బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ పదవి మూణాళ్ల ముచ్చటగా మిగిలింది. ప్రధాని పదవి చేపట్టిన ఆరు వారాల్లోనే..ఆమె విధానాలపై తీవ్ర విమర్శలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు లిజ్ ట్రస్. అధికార కన్జర్వేటివ్ పార్టీ నేతలే..ఆమెను ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలని కోరినట్లుగా తెలుస్తోంది. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన దాదాపు 100 మంది పార్లమెంట్ సభ్యులు ట్రస్‌కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం సమర్పించేందుకు ప్లాన్ చేస్తుండటం ఆమె రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. అయితే అక్టోబరు 24లోగా ఆమెను గద్దె దించేందుకు వారు ప్రయత్నాలు చేస్తుండగానే.. లీజ్ ట్రస్ ఈ నిర్ణయం తీసుకోవడంతో మరోసారి బ్రిటన్ రాజకీయ సంక్షోభంలోకి కూరుకుపోయింది.
ట్రస్ ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్‌తో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత దివాలా తీసింది. మినీ బడ్జెట్‌లో సంపన్నులకు పన్ను కోతలు విధించడంపై వ్యతిరేకత రావడం..ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం..ఆ తర్వాత ఆర్థిక మంత్రిగా ఉన్న క్వాసీ కార్టెంగ్‌ను పదవి నుంచి తొలగించడం వంటి పరిణామాలతో లిజ్ ట్రస్‌పై పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తోంది. పార్టీలో 62శాతం మంది నేతలు తాము తప్పుడు అభ్యర్థిని ఎన్నుకున్నామనే భావనలో ఉన్నారు.
తెరమీదికి రిషి సునాక్..
ఐతే లిజ్ ట్రస్‌ను పదవి నుంచి తొలగిస్తే ఆమె స్థానంలో రిషి సునాక్‌ను తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే జరిగితే.. 2016లో ఈయూ నుంచి బ్రిటన్ వైదొలిగిన తర్వాత..ప్రధాని అర్థాంతరంగా పదవి నుంచి దిగిపోవడం ఇది మూడోసారి అవుతుంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం