పాక్‌పై ఆఫ్గన్‌ కన్నెర్ర

పాక్‌పై మరోసారి కన్నెర్ర చేసింది ఆప్గనిస్తాన్‌. కశ్మీర్‌తో తమ దేశాన్ని పోల్చొద్దని హితవు పలికింది. పాకిస్తాన్‌ రాయబారి అసద్‌ మజీద్‌ఖాన్‌ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆఫ్గానిస్తాన్‌ అంబాసిడర్‌ రోయా రహ్మానీ. తమ దేశంపై బాధ్యతారాహిత్యంగా మాట్లాడొద్దంటూ ట్వీట్‌ చేశారు. కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులు ఆఫ్గాన్‌లో ప్రభావం చూపుతాయన్న వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. సరిహద్దుల్లో పాక్‌ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోదంటూ మండిపడ్డారు. ఇందులో పాక్‌ పాత్ర లేకపోతే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆఫ్గాన్‌ నుంచి పాక్‌కు ఎలాంటి […]

పాక్‌పై ఆఫ్గన్‌ కన్నెర్ర
Follow us

|

Updated on: Aug 19, 2019 | 4:39 PM

పాక్‌పై మరోసారి కన్నెర్ర చేసింది ఆప్గనిస్తాన్‌. కశ్మీర్‌తో తమ దేశాన్ని పోల్చొద్దని హితవు పలికింది. పాకిస్తాన్‌ రాయబారి అసద్‌ మజీద్‌ఖాన్‌ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆఫ్గానిస్తాన్‌ అంబాసిడర్‌ రోయా రహ్మానీ. తమ దేశంపై బాధ్యతారాహిత్యంగా మాట్లాడొద్దంటూ ట్వీట్‌ చేశారు. కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులు ఆఫ్గాన్‌లో ప్రభావం చూపుతాయన్న వ్యాఖ్యలు అర్థరహితమన్నారు.

సరిహద్దుల్లో పాక్‌ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోదంటూ మండిపడ్డారు. ఇందులో పాక్‌ పాత్ర లేకపోతే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆఫ్గాన్‌ నుంచి పాక్‌కు ఎలాంటి ప్రమాదం లేకపోయినా..సరిహద్దుల్లో సైన్యాన్ని ఎందుకు మోహరించిందో అర్థం కావడం లేదన్నారు. 370 ఆర్టికల్‌ రద్దుపై ఇటీవలే మజీద్‌ఖాన్‌ వ్యాఖ్యలపై మండిపడిన ఆఫ్గాన్‌..తాజాగో మరోసారి పాక్‌ తీరుపై ఫైరైంది.