ఇండియా పై మళ్ళీ విషం కక్కిన ఇమ్రాన్ ఖాన్ .. తీరు మారేదెన్నడు ?

ఇండియామీద, ముఖ్యంగా ప్రధాని మోదీ ప్రభుత్వంపై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మళ్ళీ విషం కక్కాడు. ఇటీవల పాక్ ఆక్రమిత ముజఫరాబాద్ లో తమ దేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తన ప్రసంగంలో… మోదీసహా బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ లపై ఎలా అనుచిత వ్యాఖ్యలు చేశాడో తిరిగి అదే పంథా కొనసాగించాడు. ‘ హిందూ దురభిమాని అయిన మోదీ ప్రభుత్వం పాకిస్తాన్ కు, ఇండియాలోని మైనారిటీలకు ముప్పుగా పరిణమించిందని తన హ్యాష్ ట్యాగ్ లో పేర్కొన్నాడు. […]

ఇండియా పై మళ్ళీ విషం కక్కిన ఇమ్రాన్ ఖాన్ .. తీరు మారేదెన్నడు ?
Follow us

|

Updated on: Aug 19, 2019 | 1:55 PM

ఇండియామీద, ముఖ్యంగా ప్రధాని మోదీ ప్రభుత్వంపై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మళ్ళీ విషం కక్కాడు. ఇటీవల పాక్ ఆక్రమిత ముజఫరాబాద్ లో తమ దేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తన ప్రసంగంలో… మోదీసహా బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ లపై ఎలా అనుచిత వ్యాఖ్యలు చేశాడో తిరిగి అదే పంథా కొనసాగించాడు. ‘ హిందూ దురభిమాని అయిన మోదీ ప్రభుత్వం పాకిస్తాన్ కు, ఇండియాలోని మైనారిటీలకు ముప్పుగా పరిణమించిందని తన హ్యాష్ ట్యాగ్ లో పేర్కొన్నాడు. మధ్యలో… నెహ్రు-గాంధీల ఇండియా అని కూడా అదేపనిగా ప్రస్తావించాడు. నాజీ సిధ్ధాంతాలకు, జీనోసైడ్ (అరాచక) ఆర్ ఎస్ ఎస్, బీజేపీ ఐడియాలజీకి మధ్య ఉన్న లింకు, వారి పూర్వీకుల నిర్వాకం ఏమిటో గూగుల్ లో వెతికితే తెలుస్తుంది అంటూ ఇమ్రాన్ అక్కసు వెలిగక్కాడు. ఇలా అవకాశం వఛ్చినప్పుడల్లా ఈయన తన ద్వేషాన్ని చూపుతూ భారత, పాకిస్తాన్ దేశాల మధ్య దూరాన్ని మరింత పెంచుతున్నాడు.