వరుస పేలుళ్లతో దద్ధరిల్లిన జలాలాబాద్.. 66 మందికి గాయాలు

వరుస పేలుళ్లతో ఆఫ్టన్ దద్ధరిల్లింది. జ‌లాలాబాద్‌లో ఇవాళ ఆరు చోట్ల వరుస పేలుళ్లు జ‌రిగాయి. రెస్టారెంట్లు, ప‌బ్లిక్ ప్రాంతాల్లో ఈ ఘ‌ట‌నలు చేసుకున్నాయి. పేలుళ్ల ధాటికి సుమారు 66 మంది పౌరులు గాయ‌ప‌డ్డారు. వెంటనే క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వందేళ్ల ఆఫ్ఘన్ స్వాత్రంత్య్ర దినోత్స వేడుకలు దేశ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. అయితే నాన్‌ఘ‌ర్ ప్రావిన్సులోని జ‌లాలాబాద్ సిటీలో ఇవాళ ఆరు ప్రాంతాల్లో పేలుడు ఘ‌ట‌న‌లు జ‌రిగాయి. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను లక్ష్యంగా చేసుకుని […]

వరుస పేలుళ్లతో దద్ధరిల్లిన జలాలాబాద్.. 66 మందికి గాయాలు
Follow us

| Edited By:

Updated on: Aug 19, 2019 | 5:07 PM

వరుస పేలుళ్లతో ఆఫ్టన్ దద్ధరిల్లింది. జ‌లాలాబాద్‌లో ఇవాళ ఆరు చోట్ల వరుస పేలుళ్లు జ‌రిగాయి. రెస్టారెంట్లు, ప‌బ్లిక్ ప్రాంతాల్లో ఈ ఘ‌ట‌నలు చేసుకున్నాయి. పేలుళ్ల ధాటికి సుమారు 66 మంది పౌరులు గాయ‌ప‌డ్డారు. వెంటనే క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వందేళ్ల ఆఫ్ఘన్ స్వాత్రంత్య్ర దినోత్స వేడుకలు దేశ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. అయితే నాన్‌ఘ‌ర్ ప్రావిన్సులోని జ‌లాలాబాద్ సిటీలో ఇవాళ ఆరు ప్రాంతాల్లో పేలుడు ఘ‌ట‌న‌లు జ‌రిగాయి. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను లక్ష్యంగా చేసుకుని ఈ ఘటనకు పాల్పడ్డారు. అయితే ఈ దాడుల‌కు బాధ్య‌త ఎవ‌రూ ప్ర‌క‌టించుకోలేదు. కాగా, రెండు రోజుల క్రిత‌మే కాబూల్‌లో ఓ పెళ్లి వేడుక‌లో జ‌రిగిన ఆత్మాహుతి దాడిలో సుమారు 63 మంది మృతిచెందిన విష‌యం తెలిసిందే. స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ఆఫ్ఘన్ అధ్య‌క్షుడు అష్ర‌ఫ్ ఘ‌నీ ప్ర‌పంచ దేశాల సాయాన్ని కోరారు. మిలిటెంట్ల ఏరివేత‌కు అంత‌ర్జాతీయ దేశాలు స‌హ‌క‌రించాల‌న్నారు.