AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇజ్రాయెల్‌పై లెబనాన్ దాడి.. డ్రోన్లు, రాకెట్లను గగనతలంలో ధ్వంసం చేసిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్

ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) మాట్లాడుతూ.. రాకెట్ దాడికి కొద్దిసేపటి ముందు ఉత్తర ఇజ్రాయెల్‌లో హెచ్చరిక సైరన్‌లు మ్రోగించినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాతే ఈ దాడి జరిగింది. లెబనీస్ భూభాగం నుంచి వస్తున్న సుమారు 40 లాంచీలను గుర్తించామని వాటిలో చాలా వరకు అడ్డుకున్నామని IDF తెలిపింది. కొన్ని రాకెట్లు బహిరంగ ప్రదేశాల్లో పడిపోయాయి. ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణనష్టం లేదా గాయపడినట్లు నివేదికలు అందలేదని వెల్లడించింది.   

ఇజ్రాయెల్‌పై లెబనాన్ దాడి.. డ్రోన్లు, రాకెట్లను గగనతలంలో ధ్వంసం చేసిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్
Lebanon Attack On Israel
Surya Kala
|

Updated on: Apr 13, 2024 | 7:40 AM

Share

ఓ వైపు హమాస్ తో పోరాడుతున్న ఇజ్రాయెల్ ఇప్పుడు ఇరాన్ తో కూడా పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రోజు రోజుకీ ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తత పెరుగుతోంది. దీంతో వ్యవహారం యుద్ధం దాకా చేరింది. ఇరాన్ త్వరలో ఇజ్రాయెల్ పై దాడి చేసే అవకాశం ఉందని అమెరికా ఇప్పటికే హెచ్చరించింది. కాగా, ఇజ్రాయెల్ పై లెబనాన్ దాడి చేసిందనే వార్తలు వెలువడ్డాయి. లెబనాన్ నుంచి ఉత్తర ఇజ్రాయెల్ వైపు డజన్ల కొద్దీ రాకెట్లు ప్రయోగించబడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. అయితే ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఈ రాకెట్లను గగనతలంలో ధ్వంసం చేసింది.

దాడి గురించి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) మాట్లాడుతూ.. రాకెట్ దాడికి కొద్దిసేపటి ముందు ఉత్తర ఇజ్రాయెల్‌లో హెచ్చరిక సైరన్‌లు మ్రోగించినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాతే ఈ దాడి జరిగింది. లెబనీస్ భూభాగం నుంచి వస్తున్న సుమారు 40 లాంచీలను గుర్తించామని వాటిలో చాలా వరకు అడ్డుకున్నామని IDF తెలిపింది. కొన్ని రాకెట్లు బహిరంగ ప్రదేశాల్లో పడిపోయాయి. ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణనష్టం లేదా గాయపడినట్లు నివేదికలు అందలేదని వెల్లడించింది.

ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఏమి చెప్పింది?

ఇంతకుముందు కూడా లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ భూభాగంలోకి ప్రవేశించిన రెండు హిజ్బుల్లా పేలుడు UAVలను IDF వైమానిక రక్షణ శ్రేణి విజయవంతంగా అడ్డగించిందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ తెలిపింది. ఇంటర్‌సెప్టర్ నుంచి ష్రాప్నెల్ పడిపోయే ప్రమాదం కారణంగా రామోట్ నఫ్తాలీలో సైరన్లు మోగించారు.

ఇవి కూడా చదవండి

లెబనీస్ భూభాగం నుంచి రామోట్ నఫ్తాలీ వైపు రాకెట్ దాడులు జరిగినట్లు ముందుగా గుర్తించామని ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. ముప్పును తొలగించడానికి IDF దక్షిణ లెబనాన్‌లోని అనేక ప్రదేశాలపై దాడి చేసింది. క్షిపణులు మాత్రమే కాకుండా, లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ గగనతలంలోకి ప్రవేశించిన రెండు డ్రోన్‌లను కూడా IDF నిలిపివేసిందని ఆయన పేర్కొన్నారు. రెండు డ్రోన్‌లు హిజ్బుల్లాకు చెందిన పేలుడు డ్రోన్‌లని IDF తెలిపింది.

సైన్యాన్ని పంపిన అమెరికా

మరోవైపు, లెబనాన్‌లో రాకెట్ దాడుల తర్వాత అమెరికా మరింత అప్రమత్తమైంది. ఇరాన్ దాడి భయంతో మధ్యప్రాచ్యంలో అమెరికా అదనపు బలగాలను పంపుతున్నట్లు అమెరికా అధికారి ఒకరు తెలిపారు. అయితే అమెరికాకు గల్ఫ్ దేశాలు కొత్త సమస్యను సృష్టించాయి.

ఇరాన్‌పై దాడి చేసేందుకు తమ భూభాగంలోని సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకోవడానికి అనుమతినివ్వమని కువైట్, ఖతార్‌లు అమెరికాకు స్పష్టం చేశాయి. గల్ఫ్ దేశంలో అమెరికాకు భారీ సైనిక స్థావరం ఉంది. ఇక్కడ సుమారు 40 వేల మంది సైనికులు మోహరించినట్లు తెలుస్తోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..