ప్రపంచంలో బెస్ట్ కపుల్.. ఆదర్శ జోడికి కావాల్సింది హైట్, వెయిట్ కాదు.. మరి ఏంటంటే?
ఎన్నో గుణగణాలను చూసి జీవితభాగస్వాములుగా ఎంపిక చేసుకున్నా.. చిన్న చిన్న కారణాలతో విడిపోవడానికి కూడా రెడీ అవుతున్నారు. అయితే నిజంగా పెళ్లి చేసుకుని హ్యాపీగా జీవించడానికి కావాల్సింది ఒకరి మీద ఒకరికి ప్రేమ, నమ్మకం అని అంటున్నారు అమెరికాకు చెందిన జంట.. ఇటీవల ఈ జంట అత్యధిక దూరం ప్రయాణించి ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది కూడా. మరి ఈ జంట స్పెషాలిటీ ఏమిటో తెలుసుకుందాం..

పెళ్లి అంటే ముందుగా యువతీ యువకులు తమ పాట్నర్ విషయంలో చూసేది.. మంచి ఎత్తు, రంగు, జీతం ఆస్తి అంతస్తులు ఇలాంటివి.. ఎన్నో గుణగణాలను చూసి జీవితభాగస్వాములుగా ఎంపిక చేసుకున్నా.. చిన్న చిన్న కారణాలతో విడిపోవడానికి కూడా రెడీ అవుతున్నారు. అయితే నిజంగా పెళ్లి చేసుకుని హ్యాపీగా జీవించడానికి కావాల్సింది ఒకరి మీద ఒకరికి ప్రేమ, నమ్మకం అని అంటున్నారు అమెరికాకు చెందిన జంట.. ఇటీవల ఈ జంట అత్యధిక దూరం ప్రయాణించి ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది కూడా. మరి ఈ జంట స్పెషాలిటీ ఏమిటో తెలుసుకుందాం..
అమెరికాలోని లారీ మెక్‌డొనెల్, అతని భార్య జెస్సికా బర్న్స్ మెక్‌డొనెల్ వారి ఎత్తు వ్యత్యాసం కారణంగా సోషల్ మీడియాలో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. 42 ఏళ్ల లారీ మెక్‌డొనెల్ ఎత్తు కేవలం 3 అడుగుల పొడవు మాత్రమే.. అతని భార్య జెస్సికా పొడవు 5 అడుగులు. మెక్‌డొనెల్ కంటే జెస్సికా రెండు ఏళ్లు చిన్నది. ఇరువురు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు 4 పిల్లలు ఉన్నారు. వీరి ఎత్తు తేడా చూసి చాలా మంది నెటిజన్లు ప్రేమ గుడ్డిదంటూ వ్యాఖ్యానిస్తూ ఉంటారు.
లారీ మెక్‌డొనెల్, జెస్సికా చిన్నప్పటి నుండి మంచి స్నేహితులు. అయితే జెస్సికా మొదట వేరే అబ్బాయిని ప్రేమించింది. అప్పుడు లారీ మెక్‌డొనెల్ కు దూరంగా ఉంది.. అయితే జెస్సికా తాను ప్రేమించిన అబ్బాయితో విడిపోయిన తర్వాత.. వీరి స్నేహం మళ్లీ మునుపటిలా సాగింది. ఆ స్నేహం.. ప్రేమగా మారింది. కొన్నాళ్లు డేటింగ్ చేసిన తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఈ దంపతులకు నలుగురు పిల్లలున్నారు. వారిలో 16 ఏళ్లు, 15ఏళ్లు, 13 ఏళ్లు పిల్లతో పాటు ఏడాది వయస్సు గల చిన్నారి కూడా ఉంది.
ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి
View this post on Instagram
ఇటీవల ఈ జంట ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ వీడియో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కి సంబంధించిన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయబడింది. ఈ వీడియో ఎక్కడికక్కడ వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
