Nirav Modi: వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్‌కు అప్పగింతపై తీర్పు తేదీని ఖరారు చేసిన బ్రిటన్ కోర్టు
Nirav modi: వేల కోట్ల రూపాయల బ్యాంకు కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత దేశానికి అప్పగింత విషయంలో బ్రిటన్ కోర్టు తీర్పు ....
Nirav Modi: వేల కోట్ల రూపాయల బ్యాంకు కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత దేశానికి అప్పగింత విషయంలో బ్రిటన్ కోర్టు తీర్పు వచ్చే నెల 25న వెల్లడించనుంది. లండన్‌లో వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు జడ్జి సామ్యూల్ గూజీ ఈ తీర్పు తేదీని ఖరారు చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభ కోణం నేపథ్యంలో భారత్ నుంచి తప్పించుకుని బ్రిటన్‌లో ఉన్న నీరవ్ మోదీని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు.
అయితే బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్లు సైతం తిరస్కరణకు గురి కావడంతో 2019 మార్చి 19 నుంచి నీరవ్ మోదీ జైల్లోనే గడుపుతున్నాడు. గత ఏడాది నుంచి కొనసాగుతున్న కోర్టు విచారణ తుది దశకు చేరుకుంది. ఫిబ్రవరి 25న కోర్టు తీర్పుఇవ్వనుంది. అయితే బ్రిటన్-భారత్ అప్పగింత ఒప్పందం ప్రకారం బ్రిటన్ కోర్టుల్లో సంబంధిత వ్యక్తి నేరాలను భారత్ రుజువు చేయాల్సి ఉంటుంది.