Storm Filomena : మాడ్రిడ్‌ను ముంచేస్తున్న మంచు తుఫాను.. వణికిపోతున్న స్పెయిన్ జనం
స్పెయిన్‌లో మంచు కొత్త రికార్డులను సృష్టిస్తోంది. భారీగా కురుస్తున్న మంచుతో అక్కడి ప్రాంతాలు శ్వేతవర్ణంలో మారిపోయాయి. హిమపాతం కారణంగా అక్కడి ఇళ్లు, రోడ్లు, వాహనాలు మంచులో..
Storm Filomena :స్పెయిన్‌లో మంచు కొత్త రికార్డులను సృష్టిస్తోంది. భారీగా కురుస్తున్న మంచుతో అక్కడి ప్రాంతాలు శ్వేతవర్ణంలో మారిపోయాయి. హిమపాతం కారణంగా అక్కడి ఇళ్లు, రోడ్లు, వాహనాలు మంచులో కూరుకుపోయాయి. గత వారం రోజులుగాఎడతెరపిలేకుండా కురుస్తున్న మంచుతో జనం ఇంటికే పరమితమయ్యారు.
ఎడతెరపి లేకుండా కురుస్తున్న మంచు.. స్పెయిన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రికార్డు స్థాయి హిమపాతంతో అక్కడి ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో మంచు తీవ్రత అధికంగా ఉంది.
హిమపాతానికి అతిశీతల గాలులు తోడవటంతో ప్రజలు బయటకి రాలేని పరిస్థితి ఏర్పడింది. మాడ్రిడ్‌లోని భవనాలపైనా భారీస్థాయిలో మంచు పేరుకుపోయిపోయింది.
కొన్ని చోట్ల మాత్రం.. స్థానికులు మంచులో స్కేటింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మాడ్రిడ్ నగరంలోని ప్రధాన రహదారుల్లో స్థానికులు ఆడుకుంటూ కనిపించారు. మరోవైపు రహదారులపై 20 సెంటీమీటర్ల మంచు పాతం పేరుకుపోయింది. మేర మంచు పేరుకుపోవటంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో వాహనాలన్నీ మాడ్రిడ్ సరిహద్దుల్లోనే చిక్కుకుపోయాయి. రంగంలోకి దిగిన స్పెయిన్ సైనిక బలగాలు యుద్ధప్రాతిపదికన రోడ్లపై పేరుకుపోయిన హిమాన్ని తొలగిస్తున్నాయి.