AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాబూల్‌లో పేలుడు.. జర్నలిస్టుతో సహా ముగ్గురు మృతి

అఫ్ఘనిస్థాన్ దేశం మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది. తాజాగా కాబూల్ నగరంలో శనివారం ఉదయం జరిగిన పేలుడు ఘటనలో ఓ జర్నలిస్టుతో సహా ముగ్గురు మృత్యువాతపడ్డారు.

కాబూల్‌లో పేలుడు.. జర్నలిస్టుతో సహా ముగ్గురు మృతి
Balaraju Goud
|

Updated on: Nov 07, 2020 | 5:24 PM

Share

అఫ్ఘనిస్థాన్ దేశం మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది. తాజాగా కాబూల్ నగరంలో శనివారం ఉదయం జరిగిన పేలుడు ఘటనలో ఓ జర్నలిస్టుతో సహా ముగ్గురు మృత్యువాతపడ్డారు. కాబూల్ నగరంలో శనివారం ఉదయం 7.30 గంటలకు దుండగులు బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ పేలుడు ఘటనలో టోలో న్యూస్ లో జర్నలిస్టుగా పనిచేసిన యమా శియావాష్ అక్కడిక్కడే ప్రాణాలొదిలారు. కాగా, మాజీ జర్నలిస్టుతో పాటు మరో ఇద్దరు ప్రయాణిస్తున్న కారును లక్ష్యంగా చేసుకొని మాగ్నటిక్ మందుపాతరను పేల్చారు. ఈ పేలుడులో మాజీ జర్నలిస్టుతోపాటు ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. ఈ పేలుడు ఘటనకు ఎవరు పాల్పడ్డారనేది ఎవరూ ప్రకటించలేదు. ప్రమాద అనంతరం ఆ ప్రాంతమంతా భయానకంగా మారిపోయింది. ఈ పేలుడు ఘటనతో కాబూల్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటనకు గల కారణాలపై కాబూల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అప్ఘనిస్థాన్ దేశంలో తరచూ పేలుళ్లు జరుగుతుండటంతో ఇక్కడి ప్రజలు కలవరపడతున్నారు.

Follow Us
కోట్లాది మంది నమ్మకాన్ని తలకిందులు చేసిన తాజా మెడికల్ రిపోర్ట్!
కోట్లాది మంది నమ్మకాన్ని తలకిందులు చేసిన తాజా మెడికల్ రిపోర్ట్!
లక్షల టన్నుల బరువుండే షిప్‌లు నీటిలో ఎందుకు మునగవు?
లక్షల టన్నుల బరువుండే షిప్‌లు నీటిలో ఎందుకు మునగవు?
నిమ్మ తొక్కే కదా అని పారేస్తున్నారా?ఈ బెనిఫిట్స్ తెలిస్తే..
నిమ్మ తొక్కే కదా అని పారేస్తున్నారా?ఈ బెనిఫిట్స్ తెలిస్తే..
పూరిగుడిసెలోకి చొరబడిన విషసర్పం..గాఢ నిద్రలో ఉన్న తల్లి, కూతురిపై
పూరిగుడిసెలోకి చొరబడిన విషసర్పం..గాఢ నిద్రలో ఉన్న తల్లి, కూతురిపై
రెస్టారెంట్‌లో ఫుడ్‌ బాగోలేదని గొడవ పడకండి.. ఇలా ఫిర్యాదు చేయండి!
రెస్టారెంట్‌లో ఫుడ్‌ బాగోలేదని గొడవ పడకండి.. ఇలా ఫిర్యాదు చేయండి!
కాశీబుగ్గ బైక్ యాక్సిడెంట్ కేసులో సంచలన ట్విస్ట్..!
కాశీబుగ్గ బైక్ యాక్సిడెంట్ కేసులో సంచలన ట్విస్ట్..!
పూరీ జగన్నాథ ఆలయంలో శంఖం ఎందుకు ఊదరు? ఈ సంప్రదాయం వెనుక ఉన్న..
పూరీ జగన్నాథ ఆలయంలో శంఖం ఎందుకు ఊదరు? ఈ సంప్రదాయం వెనుక ఉన్న..
'వెంకీ' సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా?
'వెంకీ' సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా?
ఒక చేతిలో ఫోన్.. మరో చేతిలో నాగుపాము.. షాకింగ్ వీడియో!
ఒక చేతిలో ఫోన్.. మరో చేతిలో నాగుపాము.. షాకింగ్ వీడియో!
మత్స్యకారుల వలకు చిక్కిన ఊహించని అద్భుతం.. బండరాయి అనుకొని..
మత్స్యకారుల వలకు చిక్కిన ఊహించని అద్భుతం.. బండరాయి అనుకొని..