పీఎస్ఎల్వీ సీ49 రాకెట్ ప్రయోగం విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో మైలురాయిని అందుకుంది. మరో అద్భుత ఘట్టాన్ని ఇస్రో తన ఖాతాలో వేసుకున్నది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో మైలురాయిని అందుకుంది. మరో అద్భుత ఘట్టాన్ని ఇస్రో తన ఖాతాలో వేసుకున్నది. అంతరిక్ష పరిశోధనలకు ఎలాంటి సమయమైన అనుకూలమని నిరూపించారు భారత శాస్త్రవేత్తలు. పీఎస్ఎల్వీ సీ49 రాకెట్‌ను దిగ్విజయంగా ప్రయోగించి గగనతంలో మరో కలికితురాయిని చేర్చారు. శనివారం ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా పది ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. పీఎస్ఎల్వీ సీ49 రాకెట్ ద్వారా ఈ శాటిలైట్లను ప్రయోగించారు. 575 కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్ష్యలోకి శాటిలైట్లను ప్రవేశపెట్టారు. ఇస్రోకు చెందిన EOS-01తో పాటు విదేశాలకు చెందిన 9 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించారు.
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట నుంచి ఇవాళ మధ్యాహ్నం 3.10 నిమిషాలకు పీఎస్ఎల్వీ సీ49 రాకెట్ నింగికి నిప్పులు చెరుగుతూ దూసుకెళ్లింది. ఈ రాకెట్‌తో ఈఓఎస్-1 శాటిలైట్‌తో పాటు మరో 9 కస్టమర్ శాటిలైట్లను నింగిలోకి ప్రవేశపెట్టారు. పీఎస్ 1 పర్ఫార్మెన్స్ నార్మల్‌గా సాగింది. పీఎస్2 కూడా నార్మల్‌గా కొనసాగింది. పేలోడ్ ఫేరింగ్ కూడా అనుకున్నట్లే సపరేట్ అయ్యింది. పీఎస్ఎల్వీ బరువు 290 టన్నులు. అన్ని దశలు అనుకున్న రీతిలో పూర్తి అయ్యాయి. తొమ్మిది ఉపగ్రహాల్లో అమెరికా, లగ్జంబర్గ్, లుథివేనియా దేశాలకు చెందిన ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చారు ఇస్రో శాస్త్రవేత్తలు. అమెరికాకు చెందిన లీమర్ ఉపగ్రహాలను.. మల్టీ మిషన్ రిమోట్ సెన్సింగ్ కోసం వినియోగించనున్నారు. లగ్జంబర్గ్‌కు చెందిన శాటిలైట్లను మారిటైమ్ అప్లికేషన్ల కోసం వాడనున్నారు. టెక్నాలజీ డెమానిస్ట్రేషన్ కోసం లుథివేనియా ఉపగ్రహాలు వినియోగించనున్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు.
All nine customer satellites successfully separated and injected into their intended orbit#PSLVC49 pic.twitter.com/rrtL3sVAI3
— ISRO (@isro) November 7, 2020
ఇవాళ ఉదయం పీఎస్2 రెండవ దశలో ఆక్సిడైజర్ ఫిల్లింగ్ ప్రక్రియను ప్రారంభించారు. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ EOS-01తో.. వ్యవసాయం, అటవీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ అప్లికేషన్లు పరిశీలించనున్నారు. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం కస్టమర్ శాటిలైట్లను ప్రయోగించారు. పీఎస్ఎల్వీ సీ49 రాకెట్ విజయవంతం పట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇస్రో అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు.
I congratulate @ISRO and India’s space industry for the successful launch of PSLV-C49/EOS-01 Mission today. In the time of COVID-19, our scientists overcame many constraints to meet the deadline.
— Narendra Modi (@narendramodi) November 7, 2020