రోడ్లపైకి వచ్చి జో బైడెన్‌ అనుచరుల డ్యాన్సులు

అమెరికాలో విజయం దోచూచులాడటంతో నాయకుల అనుచరులు రోడ్డెక్కారు. ట్రంప్‌, బైడెన్‌ మద్దతుదారులు అమెరికాలో పలు ప్రాంతాల్లో ర్యాలీలు తీశారు. కౌంటింగ్‌ నిలిపేయాలని ట్రంప్‌ అనుచరులు యూఎస్ ఎలక్షన్ సెంటర్స్ ముందు ఆందోళనకు దిగుతున్నారు. అయితే  ప్రతీ ఓటూ లెక్కించాల్సిందే అని బైడెన్‌ అనుచరులు పట్టుబడుతున్నారు. రోడ్లపైకొచ్చి ఆనందంతో డ్యాన్సులు చేస్తున్నారు. అగ్రనేతల మద్దతుదారుల ర్యాలీలతో అమెరికాలో రాజకీయం బాగా వేడెక్కింది. అయితే  గెలవబోయేది తామేనంటూ ప్రకటించారు బైడెన్‌. ప్రశాంతంగా, సంయమనంగా ఉండాలని మద్దతుదారులకు పిలుపునిచ్చారు. మరోవైపు, పెన్సిల్వేనియాలో […]

  • Venkata Narayana
  • Publish Date - 1:21 pm, Sat, 7 November 20
రోడ్లపైకి వచ్చి జో బైడెన్‌ అనుచరుల డ్యాన్సులు

అమెరికాలో విజయం దోచూచులాడటంతో నాయకుల అనుచరులు రోడ్డెక్కారు. ట్రంప్‌, బైడెన్‌ మద్దతుదారులు అమెరికాలో పలు ప్రాంతాల్లో ర్యాలీలు తీశారు. కౌంటింగ్‌ నిలిపేయాలని ట్రంప్‌ అనుచరులు యూఎస్ ఎలక్షన్ సెంటర్స్ ముందు ఆందోళనకు దిగుతున్నారు. అయితే  ప్రతీ ఓటూ లెక్కించాల్సిందే అని బైడెన్‌ అనుచరులు పట్టుబడుతున్నారు. రోడ్లపైకొచ్చి ఆనందంతో డ్యాన్సులు చేస్తున్నారు. అగ్రనేతల మద్దతుదారుల ర్యాలీలతో అమెరికాలో రాజకీయం బాగా వేడెక్కింది. అయితే  గెలవబోయేది తామేనంటూ ప్రకటించారు బైడెన్‌. ప్రశాంతంగా, సంయమనంగా ఉండాలని మద్దతుదారులకు పిలుపునిచ్చారు. మరోవైపు, పెన్సిల్వేనియాలో ఒక కౌంటింగ్‌ సెంటర్‌పై దాడికి ప్రయత్నించిన సాయుధ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కౌంటింగ్‌ కేంద్రంలో మెయిల్‌ ద్వారా పోలైన ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయుధం కలిగిన ఒక వ్యక్తి కారులో వర్జీనియా నుంచి ఆ కేంద్రం వైపునకు వెళ్తుండాన్ని గమనించిన కొందరు పోలీసులను అలెర్ట్‌ చేశారు. దీంతో ఫిలడెల్ఫియా వద్ద ఆ కారును పోలీసులు నిలువరించారు. వాహనంలోని ఆయుధాన్ని స్వాధీనం చేసుకుని అతడ్ని అరెస్ట్‌ చేశారు.