భార్య మీద కోపంతో నాలుగు వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లిన భర్త!

ఆలుమగలన్నాక చిరుకోపాలు, అలకలు సహజం! కొట్టేసుకునేంత వరకు వెళితేనే ప్రాబ్లం... ఇటలీలోని కోమోలో ఓ మొగుడు పెళ్లాలున్నారు.. రోజూ గొడవపడందే వారికి నిద్రపట్టదు.. ఓసారి మాత్రం ఆ గొడవ తారస్థాయికి వెళ్లింది.. ఇద్దరూ గట్టిగా తిట్టేసుకున్నారు..

భార్య మీద కోపంతో నాలుగు వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లిన భర్త!
Follow us
Balu

|

Updated on: Dec 05, 2020 | 12:33 PM

ఆలుమగలన్నాక చిరుకోపాలు, అలకలు సహజం! కొట్టేసుకునేంత వరకు వెళితేనే ప్రాబ్లం… ఇటలీలోని కోమోలో ఓ మొగుడు పెళ్లాలున్నారు.. రోజూ గొడవపడందే వారికి నిద్రపట్టదు.. ఓసారి మాత్రం ఆ గొడవ తారస్థాయికి వెళ్లింది.. ఇద్దరూ గట్టిగా తిట్టేసుకున్నారు.. నువ్వు తిడితే నేనేందుకు పడాలి అని గాట్టిగా ఒక్కటిచ్చుకుంది భార్యామణి.. ఆ దెబ్బకు మనవాడు బాగా హర్టయ్యాడు.. ‘నా మీద చేయి చేసుకుంటావా? ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండను’ అంటూ బయటకెళ్లాడు.. వెళ్లినవాడు కాసేపు అటూ ఇటూ తిరిగి ఇంటికొస్తే బాగుండేది.. కానీ అతడేమో అలా నడుచుకుంటూ వెళ్లిపోయాడు.. రాజకీయ నాయకులు పాదయాత్ర చేస్తున్నట్టుగా నడుస్తూ పోయాడు.. ఎన్నో ఊళ్లు దాటాడు.. అయినప్పటికీ అతగాడి కోపం తగ్గలేదు.. అలా వెళుతూ వెళుతూ చాలా దూరం వెళ్లిపోయాడు. ఎంతనుకుంటున్నారు..? 418 కిలోమీటర్లు…నమ్మకం కుదరడం లేదు కదూ! నిజంగానే అంతదూరం నడిచాడు.. ఈ విషయం ఇటలీ పోలీసులే చెప్పారు.. ఇటలీ పోలీసులకు అబద్దాలు చెప్పే అవసరం ఏముంటుంది? వాళ్లకు మట్టుకు ఎలా తెలిసిందంటారా? గిమర్రా పట్టణంలో లాక్‌డౌన్‌ కర్ఫ్యూను ఉల్లంఘించి ఇతడు ఒంటరిగా నడుచుకుంటూ వెళుతుంటే అనుమానం వచ్చి పోలీసులు ఆపారు.. విషయం తెలుసుకున్నారు.. ఔరా అని ముక్కున వేలేసుకున్నారు. అప్పటికే ఇతను తప్పిపోయినట్టు అర్ధాంగి కంప్లయింట్‌ ఇవ్వడంతో పోలీసులు అతడిని స్టేషన్‌కు పట్టుకొచ్చారు..ఎందుకు బాబూ…! అలా నడిచావు అని అడిగితే భార్యమీద కోపం పట్టలేక అని సింపుల్‌గా జవాబిచ్చాడు.. ఆ కోపంతోనే వారం రోజులపాటు నడుస్తూ వెళ్లానని, దారిలో కొందరు దయతో తన ఆకలిదప్పులు తీర్చారని అన్నాడు..తన ఆరోగ్యం బ్రహ్మండంగా ఉందని, కాకపోతే కాసింత అలసిపోయానంతేనని చెబుతున్నాడు. 48 ఏళ్ల వయసులో అలా అంతదూరం నడవడం కష్టమే! కాకపోతే భార్య మీద వచ్చిన కోపం అలాంటిది మరి!

ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!