కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ఒకే చెప్పిన బెహరిన్.. వ్యాక్సిన్ ఆమోదంతో రెండవ స్థానంలోకి….
ఫైజర్-బయోటెక్ కరోనా వ్యాక్సిన్‌ను అత్యవసర వినియోగానికి బెహరిన్ ఆమోదం తెలిపింది. ఈ వ్యాక్సిన్‌కు వినియోగానికి ఒకే చెప్పిన దేశాలలో బ్రిటన్
ఫైజర్-బయోటెక్ కరోనా వ్యాక్సిన్‌ను అత్యవసర వినియోగానికి బెహరిన్ ఆమోదం తెలిపింది. ఈ వ్యాక్సిన్‌కు వినియోగానికి ఒకే చెప్పిన దేశాలలో బ్రిటన్ మొదటి స్థానంలో ఉండగా, రెండవ దేశంగా బెహరిన్ నిలిచింది. ఫైజర్ బయోటెక్ వ్యాక్సిన్ కరోనా కట్టడికి ఉపయోగపడుతుందని నేషనల్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ సీఈవో మారియమ్ అల్ జలాహ్మా తెలిపారు. యూఎస్ ఔషద కంపెనీ, జర్మన్ బయోటెక్ ఇంకా ఈ వ్యాక్సిన్‌ను ఎప్పుడు ప్రారంభిస్తాయో మనమా పేర్కొనలేదు. ప్రస్తుతానికి కరోనా నియంత్రణకు ఈ వ్యాక్సిన్‌ను ఆమోదించినట్లు, వచ్చే వారం నుంచి దీనిని ప్రారంభించనున్నట్లు బ్రిటన్ బుదవారం ప్రకటించింది.
అటూ బెహరిన్ నవంబర్‌లో… చైనాకు చెందిన సినోఫార్మ్ టీకాను ఫ్రంట్ లైన్ హెల్త్ కెర్ వర్కర్స్ పై ప్రయోగించడానికి ఆమోదం తెలిపింది. ఆ దేశంలో ప్రస్తుతానికి 87 వేలకుపైగా కొవిడ్ కేసులు నమోదు కాగా, 341 మంది మృతి చెందారు. ఫైజర్-బయోటెక్ వ్యాక్సిన్ అన్ని భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందని బ్రిటన్ శుక్రవారం ప్రకటించింది. చైనాలో మొదలైన కరోనా వైరస్ ప్రపంచం మొత్తంలో 105 మిలియన్ల మందిని బలితీసుకుంది. అంతే కాకుండా 65 మిలియన్ల మందికి పైగా ఈ మహమ్మారి బారిన పడ్డారు.