Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Israel Palestine war: ఇజ్రాయిల్..పాలస్తీనాల మధ్య యుద్ధం ముగిసింది.. మాటల యుద్ధం మొదలైంది..

Israel Palestine war: ఇజ్రాయిల్.. పాలస్తీనా మధ్య 11 రోజుల యుద్ధం శుక్రవారం ముగిసింది. హమాస్ (ఇజ్రాయెల్ మరియు పాశ్చాత్య దేశాలు దీనిని ఉగ్రవాద సంస్థ అని పిలుస్తాయి) పాలస్తీనాలోని గాజా స్ట్రిప్ ప్రాంతం నుండి ఇజ్రాయిల్‌పై రాకెట్ల కాల్పులు ఆపాయి.

Israel Palestine war: ఇజ్రాయిల్..పాలస్తీనాల మధ్య యుద్ధం ముగిసింది.. మాటల యుద్ధం మొదలైంది..
Israel War
Follow us
KVD Varma

|

Updated on: May 22, 2021 | 6:49 AM

Israel Palestine war: ఇజ్రాయిల్.. పాలస్తీనా మధ్య 11 రోజుల యుద్ధం శుక్రవారం ముగిసింది. హమాస్ (ఇజ్రాయెల్ మరియు పాశ్చాత్య దేశాలు దీనిని ఉగ్రవాద సంస్థ అని పిలుస్తాయి) పాలస్తీనాలోని గాజా స్ట్రిప్ ప్రాంతం నుండి ఇజ్రాయిల్‌పై రాకెట్ల కాల్పులు ఆపాయి. ఇజ్రాయెల్ వైమానిక దళం కూడా గాజాపై బాంబు దాడులను నిలిపివేసింది. అయితే, అల్ అక్సా మసీదు కాంపౌండ్ వద్ద ఇజ్రాయెల్ పోలీసులు, పాలస్తీనియన్ల మధ్య ఘర్షణలు జరిగాయని కొన్ని మీడియా నివేదికలు తెలిపాయి. ఇదిలా ఉంటే, యుద్ధం ముగిసిన తరువాత, ఇరుపక్షాలు మాటల యుద్ధానికి దిగాయి. దీంతో అక్కడ రాకెట్లు, బాంబుల శబ్దం ఆగిపోయిన తరువాత కూడా ఉద్రిక్తత అలాగే ఉంది. అయితే, కాల్పుల విరమణ నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన అమెరికా, ఈజిప్టు తీవ్రంగా మాట్లాడవద్దని ఇరువర్గాలకు సూచించాయి.

మేం ప్రారంభించలేదు.. ఇజ్రాయిల్ ప్రధాని

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు శుక్రవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ”మేము యుద్ధాన్ని ప్రారంభించలేదు. మానుంచి ఎటువంటి కవ్వింపు చర్యలూ లేకుండా హమాస్ ఇజ్రాయిల్‌పై 4 వేల రాకెట్లను పేల్చింది. ఈ పరిస్థితిలో, ఏ దేశమూ మౌనంగా ఉండలేడు. అలాగే, మేము కూడా భిన్నంగా లేము. ఐరన్ డోమ్ ద్వారా మమ్మల్ని మేము రక్షించుకున్నాము. అది కనుక లేకపోయి ఉంటే, హమాస్ దాడుల్లో చలా విపరీతంగా నష్టపోవాల్సి వచ్చేది.” అని చెప్పారు. మీడియా నుంచి వచ్చిన ఒక ప్రశ్నకు సమాధానంగా, నెతన్యాహు ఇలా అన్నారు. ”అమెరికన్ అధ్యక్షుడు జో బిడెన్, అదేవిధంగా ఇతర ప్రపంచ నాయకులు ఇజ్రాయిల్ వైపు ఉన్నారు. దీనికి వారికి కృతజ్ఞతలు. ఈ నాయకులు ప్రజాస్వామ్యాన్ని ఎలా ముందుకు తీసుకువెళతారు, ఉగ్రవాదులు మరణాలపై ఉత్సవాల్ని ఎలా జరుపుకుంటారు అనే విషయాన్ని ప్రపంచానికి తెలియజేశారు. ఇప్పుడు జరిగిన ఈ యుద్ధం భవిష్యత్తు కోసం మాకు ఒక పాఠం.” ఇక హమాస్ దాడుల్లో ఇజ్రాయిల్ లోని అష్కెలోన్ తీవ్రంగా ప్రభావితం అయింది. దీంతో హమాస్ రాకెట్ల దెబ్బతిన్న అష్కెలోన్ నగరానికి కొత్త ప్రణాళిక రూపొందించాలని ఇజ్రాయిల్ ప్రధాని అధికారులను కోరారు. ఇక్కడి ప్రజలకు పన్ను ప్రయోజనాలు కూడా ఇవ్వనున్నారు.

విజయం సాధించాం..హమాస్..

మరోవైపు హమాస్ ఇజ్రాయిల్ పై విజయం సాధించామని పండగ చేసుకుంది. కాల్పుల విరమణ జరిగిన వెంటనే హమాస్ కార్యకర్తలు బాణాసంచా కాలుస్తూ వీధుల్లో కలియతిరిగారని అంతర్జాతీయ వార్తాసంస్థలు వెల్లడించాయి. ఇక హమాస్ రాజకీయ చీఫ్ ఇస్మాయిల్ హనియా యొక్క త్వార్ టాక్. ఒక ప్రకటనలో ఇజ్యాయిల్ ప్రధాని నెతన్యాహు స్పందన చాలా నెమ్మదిగా ఉందని హమాస్ పేర్కొంది. మేము ఈ యుద్ధంలో ఇజ్రాయిల్ను నొప్పితో కూడా ఓడించాము. ఇది ఇజ్రాయిల్ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. ఆశ్చర్యకరంగా, కాల్పుల విరమణకు ఇజ్రాయిల్ ఈజిప్టుకు కృతజ్ఞతలు చెబుతోంది. కాని, అమెరికా గురించి కనీసం ప్రస్తావించలేదు అంటూ వ్యాఖ్యానించారు. ఇక హమాస్‌కు ఆయుధాలు ఇచ్చినందుకు ఇరాన్‌ను హనియా ప్రశంసించారు.

హనియా చేసిన ఈ ప్రకటన రాబోయే రోజుల్లో పాలస్తీనా అలాగే హమాస్ రెండింటికీ ఇబ్బంది కలిగించవచ్చు. ఎందుకంటే, ఇరాన్ తన అణు కార్యక్రమం విషయంలో అమెరికా, ఇజ్రాయెల్ లకు ఎల్లప్పుడూ లక్ష్యంగా ఉంటూ వస్తోంది.

Also Read: Israel Palestine war: ఇజ్రాయిల్..పాలస్తీనా మధ్య కాల్పుల విరమణ.. ఫలించిన ఈజిప్టు ప్రయత్నాలు..

Israel Palestine Crisis: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని మెచ్చుకున్న ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్.. ఎందుకంటే..!