Israel: నేటితో ముగిసిన కాల్పుల ఒప్పందం.. ఇజ్రాయెల్ నెక్స్ట్ ఏం చేయనుంది..?
హమాస్, ఇజ్రాయెల్ యుద్దం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. అన్ని రంగాల్లో చాలా నష్టపోయింది ఇజ్రాయెల్. ఇక గాజాలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. పసిపిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకూ అందరూ గజగజా వణికిపోతున్నారు. ఈక్రమంలో ఒకపక్క కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉండగానే, ఇజ్రాయెల్‌లో మరోసారి కాల్పుల కలకలం రేగింది.
హమాస్, ఇజ్రాయెల్ యుద్దం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. అన్ని రంగాల్లో చాలా నష్టపోయింది ఇజ్రాయెల్. ఇక గాజాలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. పసిపిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకూ అందరూ గజగజా వణికిపోతున్నారు. ఈక్రమంలో ఒకపక్క కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉండగానే, ఇజ్రాయెల్‌లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. జెరూసలేంలో బుల్లెట్ల వర్షం కురిపించారు హమాస్ ఉగ్రవాదులు. ఈ కాల్పుల్లో ముగ్గురు ఇజ్రాయేలీలు మరణించగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. దాంతో, జెరూసలేంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఇంకోవైపు బందీల విడుదలపై టెన్షన్ కంటిన్యూ అవుతోంది. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఇప్పటివరకు సుమారు వందమంది బందీలను విడుదల చేశారు హమాస్ మిలిటెంట్లు. అయితే, ఇంకా 126మంది హమాస్ చెరలోనే ఉండటంతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇవాళ్టి వరకు పొడిగించుకున్నాయ్. ఖతార్, ఈజిప్టు వంటి దేశాల దౌత్య యత్నాలతో ఇరువర్గాల మధ్య ఈ ఒప్పందం కుదిరింది.
తొలుత నాలుగు రోజుల పాటు కాల్పుల విరమణ చేపట్టేందుకు ఇజ్రాయెల్ సమ్మతించింది. నవంబరు 24న ఈ ఒప్పందం అమల్లోకి రాగా.. ఆ తర్వాత దీన్ని మరో రెండు సార్లు పొడిగించారు. మరోవైపు, ఇరు దేశాల మధ్య శాంతి స్థాపన కోసం ప్రయత్నిస్తోంది అమెరికా. అలా మొత్తంగా వారం రోజుల పాటు కాల్పుల విరమణ కొనసాగగా.. శుక్రవారం ఉదయం 7 గంటలతో ఆ ఒప్పందం గడువు ముగిసింది. ఈ ఒప్పందాన్ని మరి కొన్ని రోజులు పొడిగిస్తారని భావించినప్పటికీ దీనిపై ఇరుదేశాలు స్పందించలేదు. ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. దీంతో రానున్న రోజుల్లో ఏమవుతుందో అన్న ఆందోళన అందరిలో కొనసాగుతోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..