International Tea Day 2022: మనిషి జీవితంలో టీ పాత్ర అమోఘమైంది.. నేడు అంతర్జాతీయ టీ దినోత్సవం
International Tea Day 2022: టీ.. ఇది లేనిదే రోజు గడవదు. ఉదయం లేవగానే ముందు టీ ఉండాల్సిందే. కొందరు పుస్తకం తెరిస్తే కళ్లు ముసుకుపోతుంటాయి. ఓ టీ ఉంటే ..
International Tea Day 2022: టీ.. ఇది లేనిదే రోజు గడవదు. ఉదయం లేవగానే ముందు టీ ఉండాల్సిందే. కొందరు పుస్తకం తెరిస్తే కళ్లు ముసుకుపోతుంటాయి. ఓ టీ ఉంటే అంతా సెట్ అయిపోతుంది. పొద్దున్నే లేవగానే కాస్త బద్దం పోవాలంటే కడుపులో ఓ టీ (తేనీరు) పడాల్సిందే. రోడ్డు పక్కన ఉండే టీ కొట్టులు, టీ స్టాళ్లలో ఒక కప్పు టీ కోసం బారులు తీరుతుంటారు. ఇక చలికాలంలో ఒక టీ తాగితే ఆ మజానే వేరు. చలిగాలులు వీస్తున్న సాయంత్రం సమయంలో టీ కప్పు చేసే మాయాజాలం అంతా ఇంతా కాదు. శ్రీమంతుడు కాస్లి కప్పులో టీ తాగినా.. పేదోడికి గ్లాసులో పోసి ఇచ్చినా ఆ రుచే వేరు. ఒక కప్పు టీ మనసును ఎంతో ఉల్లాసరుస్తుంది. మే 21న అంతర్జాతీయ టీ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
టీ మొట్ట మొదటిసారిగా చైనాలో తయారు చేశారు. 4వ శతాబ్దంలో చైనాకు చెందిన వైద్యుడు తేయాకు ఆకులను ఎండబెట్టి వేడి నీటిలో నానబెట్టగా వచ్చిన చేదు డికాక్షను వైద్యపరీక్ష కోసం తాగాడు. ఆ డికాక్షను తాగినందు వల్ల అతడు ఉత్తేజాన్ని పొందాడు. అలా 15 శతాబ్దంలో నాగరిక ప్రపంచానికి టీ పరిచయమైంది. ప్రతి ఏడాది డిసెంబర్ 15న అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాము.
టీ అనే పానీయం మొట్టమొదట 1400 సంవత్సరంలో ఒక చైనీస్ చక్రవర్తి ఉపయోగించేవాడట. అలాగే జపనీయులు కూడా ఆ టీని ఎక్కువ సేవించేవారట. అప్పట్లో దేవాలయాల్లో టీని తీర్థం మాదిరిగా పంచేవారని చెబుతుంటారు.
ప్రపంచ వ్యాప్తంగా తేయాకు ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న దేశాలు టీ ప్రాధాన్యాన్ని పెంచేందుకు అంతర్జాతీయ సదస్సులను నిర్వహించాయి. ప్రతి సంవత్సరం మే 21న అంతర్జాతీయ టీ దినోత్సవం జరుపుకుంటారు. టీ ఉత్పత్తి చేస్తున్న భారతదేశం, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, ఇండోనేషియా, కెన్యా, మలావి, మలేషియా, ఉగాండా, టాంజానియా వంటి దేశాలలో 2005 నుండి ఈ దినోత్సవం జరుపుకొంటారు.
ఆరోగ్యానికి మేలు చేసే టీలెన్నో.. కొన్ని రకాల టీ తాగితే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చాయ్ తాగడం వల్ల మానసిక ఉత్తేజం కలుగుతుంది. గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. శరీరంలో చెడు ప్రభావాలను తగ్గించడంలో కొన్ని రకాల టీలు చాలా బాగా పని చేస్తాయి. గ్రీన్, లెమన్, హనీ, బ్లాక్, అల్లం టీ, బెల్లం టీమ, మసాల టీ, బాదం టీలు ఈ ఆరోగ్య ప్రదాయిని జాబితాలో ఉంటాయి. మధుమేహ బాధితులకు గ్రీన్, బ్లాక్ టీలు ఆరోగ్యమని పలు పరిశోధనలలో కూడా తేలింది.
రోజు ఉదయాన్నే పడగడుపున కొందరు టీలు తాగుతుంటారు. కానీ అంది మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు. టీలో ఎన్నో ఆల్కలాయిడ్స్ ఉంటాయి. వాటిలో చాలా వరకు ఆమ్లగుణాన్ని కలిగి ఉంటాయని చెబుతున్నారు. అందుకే పరగడుపున టీ తాగడం వల్ల అసిడిటీని పెంచుతుందని వైద్యునిపుణులు సూచిస్తున్నారు. భోజనానికి ముందు టీ తాగడం మంచి పద్దతి కాదు. టీ ఆకలిని చంపేస్తుంది. భోజనం తర్వాత కూడా కనీసం 45 నిమిషాల నుంచి గంట వరకు టీ తాగడం సరైంది కాదని సూచిస్తున్నారు. వెంటన టీ తాగితే జీర్ణమైన భోజనంలో శక్తి ఒంటికి పట్టదు. అలాగే టీతో మందులు వేసుకోవడం కూడా శ్రేయస్కరం కాదని చెబుతున్నారు.
పేదోడికి అందుబాటులో.. టీ ధర చాలా ఏళ్లుగా పేద ప్రజలకు అందుబాటులోనే ఉంటుంది. పెద్దగా ధర కూడా పెరిగినట్లు ఉండదు. తేయాకు, పాలు, చక్కెర, గ్యాస్ ధరలు పెరగడంతో టీ ధరను కూడా పెంచేశారు. ప్రస్తుతం చాయ్ రూ. నుంచి రూ.10 వరకు అమ్ముతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఎక్కువగానే ఉంటుంది. టీ ధరలు పెరిగినా ఆదరణ ఏ మాత్రం తగ్గలేదు. కూలీనాలీ చేసే సామాన్యులు సైతం ఉదయాన్నే మొదలు పెడతారు.
ఎందరోకో ఉపాధి టీ కొట్టు వల్ల ఎందరోకో ఉపాధి దొరుకుతుంది. వేల కుటుంబాలు టీ ఆధారంగా జీవనం కొనసాగిస్తున్నాయి. చాలా గ్రామాల్లో టీ షాపులపైనే ఆధారపడి బతుకుతున్నారు. ఇప్పుడు ఇంట్లో టీ చేసుకోవడం అలవాటు చేసుకున్నారు గానీ.. ఒకప్పుడు ఊళ్లల్లో టీ షాపుల ముందు ఉదయాన్నే గ్లాసులు పట్టుకుని క్యూ కట్టేవారు. కొందరైతే టీ కొట్టు వద్దకు వచ్చి పార్శిల్స్ తీసుకెళ్లుంటారు. అంతేకాకుండా కొందరు టీకొట్టుదారు టీని అమ్ముకుంటూ గల్లీల్లో, రోడ్ల పక్కనే తిరుగుతుంటారు. ప్రతి ఒక్కరిని బానిసగా మార్చే చాయ్.. ఎందరికో ఉపాధినిస్తుంది. ఈ రోజున ఎప్పుడూ తాగే సాధారణ టీ కాకుండా.. మీ ఒత్తిడిని, నొప్పుల నుంచి క్షణాల్లో ఉపశమనం కలిగించే యాలకుల టీ తాగడం ఉత్తమం. ఈ టీతో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటంటే..
☛ ఇలాచీ ఛాయ్ ముఖ్యంగా అజీర్తి సమస్యను నివారిస్తుంది. వికారంగా ఉన్నప్పుడు వేడివేడిగా ఓ కప్పు టీ తాగితే ఫలితం ఉంటుంది. అలాగే ఇది మలబద్ధకాన్నీ దూరం చేస్తుంది.
☛ యాలకుల్లో ఎక్కువగా ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అధిక రక్తపోటుకు కారణమయ్యే ప్రీరాడికల్స్ను నియంత్రిస్తాయి. అలాగే రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేసి గుండె మీద ఒత్తిడి పడకుండా చేస్తాయి. రోజులో రెండు మూడు సార్లు టీ తాగేవారు ఒక్కసారైన యాలకుల టీ తాగాల్సిందే.
☛ ఇందులో యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలుంటాయి. అందువలన గొంతునొప్పి, దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. నోటి దుర్వాసనా తగ్గుతుంది.
☛ నెలసరి సమయంలో కడుపు, నడుము నొప్పితో బాధపడేవారు ఓ కప్పు ఇలాచీ ఛాయ్ తాగితే ఉపశమనం ఉంటుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి