- Telugu News Photo Gallery Increasing of bad cholesterol can affects these parts of body in telugu health tips
Bad Cholesterol: శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే చెడు కొలెస్ట్రాల్ పెరిగినట్లే.. అవేంటో తప్పనిసరిగా తెలుసుకోండి..
Health Care Tips: చాలా మంది ఆహారం తీసుకునే విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఇది నిరంతరం కొనసాగితే శరీరంలో సమస్యలు ఏర్పడతాయి. దీని వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం ప్రారంభమవుతుంది.
Updated on: May 21, 2022 | 1:26 PM

Health Care Tips: చాలా మంది ఆహారం తీసుకునే విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఇది నిరంతరం కొనసాగితే శరీరంలో సమస్యలు ఏర్పడతాయి. దీని వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం ప్రారంభమవుతుంది. ఇది గుండె జబ్బులను కలిగించడమే కాకుండా శరీరంలోని ఇతర భాగాలపై కూడా ప్రభావం చూపుతుంది. ఇలాంటి సందర్భంగా శరీరంలో కొన్ని లక్షణాలు కనిపించడం ప్రారంభమవుతుంది.

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే ముఖ్యంగా ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. అవేంటో తెలుసుకోండి..

గుండె: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు గుండె ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమవుతుంది. ఇలాంటి వారికి తరచుగా అధిక BP ఉంటుంది. ఒకానొక సమయంలో అది స్ట్రోక్‌కి కూడా దారి తీస్తుంది. ఛాతీ నొప్పి లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించండి.

చేతులు, కాళ్లలో నొప్పి: కొలెస్ట్రాల్ పెరగడం వల్ల చేతులు లేదా కాళ్లలో నొప్పి ఉంటుంది. ధమనులలో కొవ్వు పేరుకుపోవడమే దీనికి కారణం. ఈ కొవ్వు వల్ల రక్తప్రసరణ సక్రమంగా జరగక చేతులు లేదా కాళ్లలో నొప్పి మొదలవుతుంది.

చర్మం: కొలెస్ట్రాల్ పెరగడం వల్ల చర్మంలో మార్పులు కూడా కనిపిస్తాయి. చర్మం రంగులో మార్పును చూసినట్లయితే.. దానిని విస్మరించకండి. వెంటనే డాక్టర్ ని సంప్రదించండి. అరచేతులలో లేదా పాదాల దిగువ భాగంలో పసుపు రంగు కనిపిస్తే మీ శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయి పెరిగిపోయినట్లు భావించాలి.

కళ్ళు: కొలెస్ట్రాల్ పెరుగుదలతో కళ్లలో కూడా లక్షణాలు కనిపిస్తాయి. ఈ స్థితిలో కంటి కార్నియా బయటి భాగం పైన లేదా కింద తెలుపు లేదా నీలం వంటివి కనిపిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి సందర్భంలో మీ కొలెస్ట్రాల్ ను పరీక్షించుకోవాలి.. లేదా వైద్యులను సంప్రదించాలి.





























