Coriander Benefits: కొత్తిమీరతో ఆ సమస్యలన్నింటికి చెక్ పెట్టవచ్చు.. ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..

కొత్తిమీరలో ప్రోటీన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ ఎ, బి, సి వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయి.

Coriander Benefits: కొత్తిమీరతో ఆ సమస్యలన్నింటికి చెక్ పెట్టవచ్చు.. ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..
Coriander
Follow us

|

Updated on: May 21, 2022 | 9:32 AM

Coriander Benefits: కొత్తిమీరలో ఎన్నో ఔషధాలు దాగున్నాయి. కొత్తిమీర ఆహారపు రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్య పరంగా చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. కొత్తిమీరలో ( Health Benefits of Green Coriander ) ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. దీనిలో ప్రోటీన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ ఎ, బి, సి వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయి. కొత్తిమీరను ఔషధంగా ఎలా తీసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకోండి..

కొత్తిమీర నీరు తాగాలి: పచ్చి కొత్తిమీరను ఔషదంగా వాడాలంటే.. దీని నీటిని క్రమం తప్పకుండా తాగాలి. దీని కోసం కొత్తిమీర ఆకులను బాగా కడగాలి. ఆ తరువాత పచ్చి కొత్తిమీర ఆకులను కట్ చేసి రాత్రంతా నీటిలో ఉంచండి. ఉదయం నిద్రలేవగానే ఈ నీటిని వడకట్టి. ఈ నీటిలో కొన్ని చుక్కల నిమ్మరసం కలుపుకుని తాగండి.

కడుపు సమస్యలకు: పచ్చి కొత్తిమీర ఉదరానికి సంబంధించిన అన్ని సమస్యలకు మేలు చేస్తుంది. ఇది మీ జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. కొత్తిమీర చల్లగా ఉండేలా చేస్తుంది. కడుపు నొప్పి, అజీర్ణం, గ్యాస్ మొదలైన సమస్యలతో బాధపడుతున్నవారు కొత్తిమీర నీటిని తాగడం మంచిది.

బరువు తగ్గడంలో సహాయపడుతుంది: అధిక బరువు ఉన్నవారు పచ్చి కొత్తిమీర ద్వారా బరువు తగ్గించుకోవచ్చు. కొత్తిమీర నీరు తాగడం వల్ల జీవక్రియ ప్రక్రియ వేగవంతం కావడంతోపాటు శరీరంలో నిల్వ ఉండే కొవ్వు తగ్గుతుంది. దీంతో బరువు ఈజీగా తగ్గవచ్చు.

కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది: కొలెస్ట్రాల్ స్థాయి గణనీయంగా పెరిగిన వ్యక్తులకు కొత్తిమీర నీరు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కొత్తిమీరలో కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచే అనేక గుణాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో ఇది గుండె సమస్యలను కూడా నియంత్రిస్తుంది.

మధుమేహం నుంచి ఉపశమనం: కొత్తిమీర డయాబెటిక్ రోగులకు చాలా మంచిది. పచ్చి కొత్తిమీరలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడే అంశాలు ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన తర్వాత ఈ నీటిని తాగాలి.

హిమోగ్లోబిన్‌ను పెంచుతుంది : పచ్చి కొత్తిమీర శరీరంలో రక్తం లోపాన్ని కూడా దూరం చేస్తుంది. ఇది కాకుండా క్రమం తప్పకుండా నీటిని తీసుకోవడం ద్వారా క్రమం లేని పీరియడ్స్ సమస్య తొలగిపోతుంది. పచ్చి కొత్తిమీర నీరు పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని కూడా నియంత్రిస్తుంది.

ఈ వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి..

  • కొత్తిమీర ఎక్కువ తీసుకోవడం వల్ల దుష్ప్రభావాలు కూడా కలుగవచ్చు. కావున నిపుణుల సలహా తీసుకున్న తర్వాత మాత్రమే దీనిని తీసుకోవాలి. అతిగా తీసుకోవడం వల్ల కళ్లు తిరగడం, వాపు, దద్దుర్లు వంటి సమస్యలు వస్తాయి.
  • కాలేయ రోగులు నిపుణులను సంప్రదించిన తర్వాత మాత్రమే కొత్తిమీరను తీసుకోవాలి. కొత్తిమీర తీసుకోవడం వల్ల పిత్తంపై ఒత్తిడి ఏర్పడుతుంది, ఇది కాలేయ సమస్యలను పెంచుతుంది.