- Telugu News Photo Gallery Sold for Rs 1100 crore: 1955 Mercedes Benz 300 SLR becomes world's most expensive car to be sold at auction
Mercedes-Benz 300 SLR: ఇదే ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కారు.. వేలంలో రూ.1,100 కోట్లకు అమ్ముడైంది
Mercedes-Benz 300 SLR: కొన్ని కొన్ని కార్లు వేలంలో అత్యధిక ధర పలుకుతుంటాయి. కార్లు పాతవే అయినా వాటి ప్రత్యేకతలను బట్టి అత్యధిక ధరకు అమ్ముడుపోతాయి. ఇక ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత ఖరీదైన..
Updated on: May 21, 2022 | 3:27 PM

Mercedes-Benz 300 SLR: కొన్ని కొన్ని కార్లు వేలంలో అత్యధిక ధర పలుకుతుంటాయి. కార్లు పాతవే అయినా వాటి ప్రత్యేకతలను బట్టి అత్యధిక ధరకు అమ్ముడుపోతాయి. ఇక ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కారు ఇదే. 1955 మెర్సిడెస్ బెంజ్ 300 ఎస్‌ఎల్‌ఆర్ అలెన్‌హట్ కూపే ఇది. ఏకంగా రూ.1,100 కోట్లకు (143 మిలియన్ డాలర్లు) అమ్ముడైంది.

ఈ నెల 5న జర్మనీలోని స్టట్‌గార్ట్‌లోగల మెర్సిడెస్ బెంజ్ మ్యూజియం వద్ద జరిగిన ఓ రహస్య వేలంలో ఈ రికార్డు స్థాయిలో ధర పలికింది. దీంతో 2018లో 1962 ఫెరారీ 250 జీటీవో పేరిట నమోదైన 48.4 మిలియన్ డాలర్ల రికార్డు ధరను బద్దలు కొట్టింది.

యజమాని తరఫున బ్రిటీష్ కార్ కలెక్టర్ సైమన్ కిడ్సన్ ఈ కూపే కారును అందుకున్నారని మెర్సిడెస్ బెంజ్ చైర్మన్ ఓలా కల్లేనియస్ తెలిపారు. 1955 నాటి ఈ రకం కార్లు రెండే ఉన్నాయి. అందులో ఒకటి వేలం వేయగా, రెండోది మ్యూజియంలోనే ప్రజల సందర్శనార్థం ఉంటుందని ఓలా చెప్పారు.

అయితే మెర్సిడెస్ బెంజ్ రేసింగ్ డిపార్ట్‌మెంట్ వీటిని తయారు చేసింది. ఈ కార్ల సృష్టికర్త, చీఫ్ ఇంజినీర్ రుడాల్ఫ్ అలెన్‌హట్. ఈయన్ని గుర్తుచేసే విధంగానే ఈ కారు పేరునూ పెట్టారు.
